Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నేతన్నల గోస పట్టించు కున్నది కేసీఆర్ 

ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

ఆలేరు ఆగస్టు 9 (నిజం చెపుతాం)

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక వైఎస్ఎన్ గార్డెన్స్ లో బుధవారం నాడు చేనేత మరియు జౌళి శాఖ నిర్వహించిన జాతీయ చేనేత వారోత్సవాల్లో భాగంగా మాజీ సర్పంచ్ చింతకింది మురళి నేతృత్వంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే గోంగిడి సునీత మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నాటి ఆంధ్రప్రదేశ్ పాలనలో రైతు,చేనేత దుర్భరమైన పరిస్థితిని అనుభవించారని, నేటి తెలంగాణ పాలనలో ఆ దుస్థితిని రూపుమాపేందుకు నేతన్నల గోస పట్టించు కున్నది కే.సి.ఆర్. హే నాని అలాగే అనేక సంక్షేమ ఫలాలను అందించారని గుర్తు చేశారు.

చేనేత వృత్తినే నమ్ముకున్న నేతన్నలను కార్మికులు అనవద్దని చేనేత కళాకారులని సంబోధించాలని కేసిఆర్ నేతన్నలను కొనియాడారని అన్నారు.కెసిఆర్ చేనేతకు చేనేత మిత్ర, చేనేత బీమా లాంటి అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారన్నారు.

నేతన్న అనుకోకుండా కాలం చేస్తే చేనేత బీమా కింద 5 లక్షల రూపాయలను వారంలోపు నేరుగా బాధిత కుటుంబానికి అందేట్లు వారి అకౌంట్లోనే జమ కావడం జరుగుతుందన్నారు.ఇక్కత్ కు మంచి బ్రాండ్ తీసుకురావడమే కాకుండా పేటెంట్ హక్కులు లభించే విధంగా కేంద్రం ద్వారా గుర్తింపు తీసుకువచ్చిన ఘనత కేసిఆర్ కే దక్కిందన్నారు.

ఈ డిజైన్ ను కాపీ కొడితే చట్టరీత్యా నేరమని,పూర్తిగా హక్కులు మనకే చెందుతాయని పేర్కొన్నారు.పూట గడవకపోతే నేతన్నలు బ్రతుకుతెరువు కోసం భీవండీ వంటి నగరాలకు వలస వెళ్లేవారని,తెలంగాణ ప్రభుత్వంలో మళ్లీ తిరిగి వచ్చి మగ్గం పట్టారని గర్వంగా చెప్పారు.చేనేతకు గౌరవాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ కు అందరం రుణపడి ఉండాలన్నారు.

కొత్త కొత్త డిజైన్ల ద్వారా మంచి మార్కెట్ లభిస్తుందన్నారు.కోకాపేటలో రెండున్నర ఎకరాల స్థలాన్ని పద్మశాలిల కోసం ప్రత్యేక భవనానికి 10 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మోత్కుపల్లి జ్యోతి,వైస్ చైర్మన్ పోరెడ్డి శ్రీనివాస్,పిఎసిఎస్ వైస్ చైర్మన్,చింతకింది చంద్రకళమురహరి,మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య,మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్,మాజీ ఎంపీటీసీ పుట్ట మల్లేష్ గౌడ్,జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ ఆడెపు బాలస్వామి,మార్కెట్ డైరెక్టర్ పాశికంటి శ్రీనివాస్, కౌన్సిలర్ బేతి రాములు,దుడుక ఉప్పలయ్య,సంబంధిత శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

తేదీ 9 ఆగస్టు 2023న ఆలేరులోని వైయస్సార్ గార్డెన్స్ లో జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత వారోత్సవాలను నిర్వహించడం జరిగింది. ఆలేరు నియోజకవర్గ చేనేత కార్మికులతో చేనేత వారోత్సవాలను చేనేత జాలి శాఖ యాదాద్రి భువనగిరి వారు నిర్వహించడం జరిగింది

ఈ కార్యక్రమం మనకి ముఖ్యఅతిథిగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు హాజరవుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ప్రకటించిన చేనేత మగ్గం పథకం చే నేత మిత్ర పథకం ద్వారా నెలకు 3000 రూపాయలు 59 నుండి 75 సంవత్సరాల వరకు చేనేత కార్మికులకు భీమా టి ఎస్ సి ఓ ఎక్స్ప్రెస్ 25వేల రూపాయలు పెంపు వంటి పథకాలను ఎమ్మెల్యే గారు చేనేత కార్మికులకు తెలియజేశారు

ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.