Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మెగా రక్తదాన శిబిరం*

ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని బి.ఆర్ ఫంక్షన్ హాల్ లో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఏటూరునాగారం సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మరియు రెడ్ క్రాస్ సొసైటీ వారి సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఆదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి,ఏటూరునాగారం ఐటీడీఏ పీవో హనుమంతు కె జండగే, ఏటూరునాగారం ఏ ఎస్ పి శరత్ చంద్ర పవర్, స్థానిక సిఐ కిరణ్ కుమార్, ఏటూరునాగారం సర్పంచ్ ఈసం రామ్మూర్తి, స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, మంగపేట ఎస్సై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.