Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సాగునీరు లేక వాడిపోతున్న వరి పొలాలు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా(రామచంద్రపురం )

ఆగష్టు 9.. నిజం న్యూస్

నేల తల్లికి గొంతెండి పోతుంది.పేరుకే వర్షాకాలం కాని నడి వేసవికాలం మాదిరిగా తొలకరి వరి పొలాలు నెర్రలు తీసి బీడు భూములు మాదిరిగా మారడం విస్మయం కలిగిస్తుంది.

పచ్చని చేలతో సస్యశ్యామలంగా ఉండే గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరి పొలాలు సాగునీరు లేక ఎండిపోవడం రైతన్నకు తీవ్ర మనోవేదన కలిగిస్తుంది.

సాధారణంగా ఈ పరిస్థితి దాళ్వా సీజన్లో ఉండేదని, కాని ఇప్పుడు తొలకరికి కూడా ఈ దుస్థితి రావడం చూస్తుంటే భవిష్యత్ లో ఇంకా ఎవరు వ్యవసాయం చేయరేమో?అని అగ్రహారానికి చెందిన యువ రైతు వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేసారు.

పంట కాలువల పై సరైన పర్యవేక్షణ లేకపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణం అయితే ఇటీవల కాస్తున్న ఎండల వల్ల కూడా పంట బోదేలలో చుక్క నీరు లేకపోవడానికి కారణం అని చెప్పవచ్చు.

 

ప్రకృతే వ్యవసాయనికి ఆలంబనగా నిలవాలి అలాగే అధికారులు అలసత్వం వీడి సరైన నీటి పారుదల వసతులు ఉండేలా చూడాలని రైతులు ముక్త కంఠంతో కోరుతున్నారు.