Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం సంబరాలు

చర్ల ఆగస్టు 9 (నిజం చెపుతాం

సంక్షేమ పరిషత్(ఏ ఎస్.పి) ఆదివాసి విద్యార్థి సంక్షేమ పరిషత్( ఏ వి ఎస్ పి)ఆదివాసి టీచర్స్ అసోసియేషన్( ఏ టి ఏ) ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ లో బుధవారం ఘనంగా సంబరాలను ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు మోడం విజయరామ్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలను నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి చర్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ కాపులు కృష్ణా అర్జున్ రావు హాజరై జండా ఆవిష్కరించారు అనంతరం ఆదివాసి ఉద్యోగ సంఘాల నాయకులు ఆదివాసి మహిళా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు

అనంతరం టీచర్ అసోసియేషన్ (ఏ టి ఏ )చర్ల మండల అధ్యక్షులు శ్యామల రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో. సర్పంచ్ కృష్ణార్జున రావు మాట్లాడుతూ

ఆదివాసి చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలకు బ్రతుకు జీవన విధానం ప్రశ్నార్థకంగా మారిందని వారికి ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని సెలవుదినంగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సి ఆర్ కుప్రభుత్వానికి కేసీఆర్ కు ప్రత్యేకంగా సొరవ ఈ విషయం గుర్తు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

ఏజెన్సీ ప్రాంతంలో మా ఊర్లో మా రాజ్యాన్ని స్థాపించాలని ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి ఆగస్టు 9వ తారీఖున అధికారింగా ప్రకటించిందని ఇంకా ఆదివాసులకు స్వతంత్రం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో స్వయంగా సొరవు తీసుకుని కొమురం భీం స్ఫూర్తిని నింపడానికి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర నాయకులు పాండు హేమ సుందర్ గారు మాట్లాడుతూ మా ఊర్లో మా రాజ్యాన్ని మనమే ఏర్పాటు చేసుకోవాలని ఈ స్ఫూర్తిని సమ్మక్క సారక్క కొమరం భీమ్ వారి స్ఫూర్తిని తీసుకొని యుద్ధయాత్ర కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు

ఏజెన్సీ ప్రాంతంలో 9 ఐటీడీఏ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసి సామ్రాజ్యాన్ని కలుపుతూ గోండ్వానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి వారికి ప్రత్యేకంగా అప్పజెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఇంకా అధికారికంగా చేయకపోవడం చాలా సిగ్గు సేటు అని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు .

అనంతరం అంబేద్కర్ సెంటర్ నుండి బస్టాండ్ మీదుగా గాంధీ బొమ్మ సెంటర్ నుండి పోలీస్ స్టేషన్ తాహసిల్దార్ కార్యాలయం మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ తో ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలతో కొమ్ము నృత్యం ఏర్పాటు చేసి మండల కేంద్రాన్ని ఒక పండగ వాతావరణాన్ని ఏర్పాటు లా చేశారు.

ర్యాలీ అనంతరం సభ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ మేధావులు మాట్లాడుతూ నేటికీ సమాజం లో ఆర్థిక సామాజిక రాజకీయ అసమానతులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సామాజిక వెనుకబాటును ఆర్థిక అసమానతలను రాజకీయ వెనుకబాటు ధనాన్ని రూపుమాపడానికి అన్ని ఆదివాసి సంఘాలు ఆదివాసి మిత్రులు ఏకతాటిపై నిలిచి తమ హక్కులను సాధించుకోవడానికి పోరాటం చేయవలసిన అవసరం ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో ఆదివాసి విద్యార్థి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూప నాగేశ్వరరావు సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ చర్ల మండల అధ్యక్షులు శ్యామల రామారావు తోకల లక్ష్మీపతి కారం రాజేష్ మురళి ఈశ్వర్ రామకృష్ణ .జగన్ సత్యనారాయణ శ్రీను చిట్టి బాబు సోయం శేషు సుజాత జ్యోతి ధనలక్ష్మి వరలక్ష్మి విజయలక్ష్మి రామలక్ష్మి ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.