Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

యాదాద్రీశుడిని దర్శించుకున్న సీఎంఓ కార్యదర్శి

యాదగిరిగుట్ట:ఆగస్టు9(నిజంచెపుతాం)యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిదేవస్థానాన్ని బుధవారం ముఖ్యమంత్రి కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.

అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన వెసులుబాటు కల్పించారు.

ప్రత్యేక పూజలు అనంతరం అద్దాల మండపం వద్ద అర్చకులు వేదాఆశీర్వాదం చేశారు.ఆలయ ఏఈఓ రామ్మోహన్ రావు స్వామివారి శేష వస్త్రం అభిషేకం లడ్డు ప్రసాదం అందజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ మరియు రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు. దేవస్థానానికి వివిధ విభాగాల నుంచి రూ.11,98,649 నిత్యాదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.