Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆజాద్ కా అమృత్ మహోత్సవం మేరా మాటి మేరా దేశ్

.కే ఎన్ ఎం ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ బిక్షమయ్య అధ్యక్షతన యన్ యస్ యస్ యూనిట్ వన్ మరియు టూ అధ్వర్యంలో అజాద్ కా అమృత్ మహోత్సవం-మేరా మాటి మేరా దేశ్ పోగ్రామ్ లో భాగంగా కళాశాల సిబ్బంది, యన్ యస్ యస్ వాలంటీర్స్ , విద్యార్దిని,విద్యార్దుల చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగినది.

భారత దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ 75 మొక్కల ను నాటడం జరిగినది.ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ భారతదేశం యొక్క గొప్ప సంస్కృతి మరియు సంప్రదాయం లను గౌరవించి భారతదేశ ఐక్యత మరియు సమగ్రత కోసం పని చేయాలని దేశాన్ని రక్షించే వారిని గౌరవించాలని అన్నారు

ఈ కార్యక్రమంలో ఐ క్యు ఏ సి కో ఆర్డినేటర్ ఈ రామిరెడ్డి,అకాడమిక్ కో ఆర్డినేటర్ టి.వెంకట రమణ,హరిత హారం కన్వీనర్ ఆర్ స్వప్న ,యన్ యస్ యస్ యునిట్ వన్ మరియు టూ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ యన్ కోటయ్య,జె నరేందర్ రెడ్డి, బోధన ,భోదనేతర సిబ్బంది, యన్ యస్ యస్ వాలంటీర్స్ మరియు విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు