Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

క్లైమాక్స్ కు చేరిన కాంగ్రెస్ తో షర్మిళ పార్టీ విలీనం

వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగళూరు వెళ్లి కాంగ్రెస్ నేత డి కె శివకుమార తో భేటీ అయినట్లు రాజకీయ వర్గాలలో టాక్ వినిపిస్తోంది.

కాంగ్రెస్ ముఖ్యమేత అయిన డి కె తో గత మూడు నెలలుగా షర్మిల టచ్ లొ వుండి మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం.

ఇప్పుడు జరగబోయే భేటీలొ విలీన ప్రక్రియకు సంబంధించి చర్చలు ఒక కొల్లిక్కి రానున్నాయని, త్వరలోనే డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లి వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అంశాన్ని ఫైనలైజ్ చేయబోతున్నారని టక్ వినిపిస్తోంది.

అయితే ఆమె కాంగ్రెస్ లో చేరే అంశంపై తెలంగాణా కాంగ్రెస్ నేతలలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఆమె అవసరం పార్టీకి లేదని.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గతంలో వ్యాఖ్యానించారు.

ఆంధ్రకు చెందిన షర్మిల తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయాల్లో రావడం తమకు ఇష్టం లేదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అయితే షర్మిల కాంగ్రెస్‌లో చేరాలనే అంశాన్ని మరికొందరు కాంగ్రెస్ నేతలు స్వాగతించారు. ఈ రకంగా చూస్తే రాష్ట్ర కాంగ్రెస్ షర్మిళ అంశంపై రెండుగా విడిపోయినట్లు తెలుస్తోంది.

అయితే రాజకీయ వ్యూహాలకు అపర చాణుక్యుడైన డి కె ఈ విలీనం పట్ల సుముఖంగా వున్నారు కాబట్టి షర్మిళ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవడం అనేది కేవలం లాంచనప్రాయం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తాజాగా ఇవాళ ఆమె రాహుల్ గాంధీ రీఎంట్రీతో పాటు లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో షర్మిల వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది.

పార్లమెంట్ సభ్యునిగా తిరిగి నియమించబడ్డ రాహుల్ గాంధీ గారికి నా అభినందనలు అంటూ వైఎస్ షర్మిల ఓ ప్రకటన విడుదల చేశారు

. న్యాయం, ధర్మం గెలిచాయనడానికి సుప్రీం కోర్టు తీర్పే ఒక ఉదాహరణ అన్నారు. మీరు తిరిగి పార్లమెంట్ కి రావడం దేశానికి ఎంతో అవసరం అన్నారు.ఈ వ్యాఖ్యలు చూస్తుంటే షర్మిళ కాంగ్రేలో చేరడం అనేది ఒక ఫార్మాలిటీయేనని తెలుస్తోంది.

అయితే కొంత కాలంగా త‌న పార్టీ కార్యక‌లాపాల‌కు కూడా ష‌ర్మిల దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్‌తో ఏదో ఒక‌టి తేల్చుకుని, ఆ త‌ర్వాతే క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలన్న ఆలోచనతో షర్మిల ఉన్నార‌ని రాజకీయ వర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీతో కలిసిది లేకపోతే మరో సారి పాదయాత్రతో పార్టీని ముందుకు నడిపించాలని షర్మిల భావిస్తున్నట్టు తెలుస్తుంది.

( ప్రత్యేక కధనం: ప్రతాప్)