Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పెసర పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే అంటున్న శాస్త్రవేత్తలు

గరిడేపల్లి ఆగస్టు 8 (నిజం చెపుతాం). మండల పరిధిలోని గడ్డిపల్లి గ్రామములో రైతు సాగుచేసిన పెసర పంటను విద్యార్థులతో కలిసి సందర్శించినట్లు కేవీకే ఇంఛార్జి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బి లవకుమర్ తెలిపారు.

ఈ సందర్శనలో భాగంగా పెసర పంటను వేసుకోవడం వలన కలిగే లాభాల గురించి వివరించారు. దీనివల్ల నేల సారం పెరుగుతుందన్నారు.

కేవీకే సస్యరక్షణ శాస్త్రవేత్త డి ఆదర్శ్ పెసర లో పేనుబంక, పల్లాకు తెగులు మరియు శనగ పచ్చ పురుగు గమనించడం జరిగినది.

వీటి నివారణకు అసిఫేట్ 1.5 గ్రా లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రా లేదా నోవల్యూరిన్ 1 మి.లీ. 5 మి. లీ వేప నూనెతో లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని తెలిపారు.

కేవీకే మృత్తిక శాస్త్రవేత్త ఏ కిరణ్ పెసరలో తీసుకోవలసిన ఎరువుల యాజమాన్యం గురించి తెలిపారు.

ఈ కార్యక్రమంలో రైతులు బచ్చు సైదయ్యా, జగన్నాథ్ యూనివర్సిటీ వ్యవసాయ డిగ్రీ విద్యార్థులు పవన్, నితీష్, నాగేంద్ర, తరుణ్ పాల్గొన్నారు.