తాళ్లూరి శ్రీను కిడ్నీ వ్యాధితో మరణించగా నామ ఆదేశాలు మేరకు సంబంధింత రిపోర్ట్స్ తీసుకొని పరిశీలిస్తున్న
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, నాచారం గ్రామం లో, ఇటీవలే ఖమ్మం ఎంపీ లోక్ సభ సభ్యులు నామానాగేశ్వరరావు పర్యటన లో భాగంగా, తాళ్లూరి శ్రీను కిడ్నీ వ్యాధితో మరణించగా, వారి కుటుంబ సభ్యులు , మాకు తగిన న్యాయం చేయమని నామాని కోరగా, నామా ముత్తయ్య ట్రస్ట్ ద్వారా మీకు సహాయం అందిస్తానని, హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు సేకరించమని, అశ్వారావుపేట టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారేఆదినారాయణ కి సూచించారు. అందులో భాగంగా ఈరోజు వారి ఇంటికి వెళ్లి తన రిపోర్టు ను తీసుకుంటున్న జారే. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు మరియు సొసైటీ డైరెక్టర్ ఎళ్ళిన రాఘవరావు పాల్గొన్నారు.