Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అసిస్టెంట్ డైరెక్టర్లుగా స్టార్ట్…హీరోలుగా స్టాండ్

కెరీర్లో మొదటగా అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేసి ఆ తర్వాత హీరోలుగా మారిన వారు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు. ఒకసారి ఆ జాబితాను పరిశీలిద్దాం.

1.  సప్తగిరి(saptagiri)

భారతీయుడు, సింధూరం సినిమాలు చూసి సినిమా డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీ కి వచ్చాడు. ఆ తర్వాత డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పని చేసి చాలా విషయాలు నేర్చుకున్నాడు.

బొమ్మరిల్లు సినిమాకు డైరెక్టర్ బాస్కర్ అవకాశం ఇవ్వడం జరిగింది. 2014లో విడుదలైన లవర్స్ సినిమాలో సప్తగిరి మంచి పేరు రావడంతో సినిమాలో హస్య నటుడిగా అవకాశాలు వచ్చాయి.

ఆ తర్వాత 2016లో సప్తగిరి ఎక్స్ ప్రెస్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  ఆ తర్వాత అనేక సినిమాల్లో హీరోగా, హస్య నటుడిగా అవకాశాలను సాధించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

2. సునీల్(sunil)

1998లో విడుదలైన పేరు లేని సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా బివి రమణ దగ్గర పని చేసాడు. ఆ తర్వాత రిలీజైన సెకండ్ హ్యాండ్ సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ పని చేసాడు.

ఆ తర్వాత నువ్వే కావాలి సినిమాలో సునీల్ అధ్భుతంగా నటించి మంచి పేరు తెచ్చుకోవడంతో వరుస అవకాశాలు వచ్చాయి. 2006లో విడుదల అయిన అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ  ఇచ్చాడు.

ఆ తర్వాత చాలా సినిమాల్లో పని చేసి బెస్ట్ హీరోగానే కాకుండా కమెడీయన్ గా పేరు తెచ్చుకున్నాడు.

3. రాజ్ తరుణ్(raj tarun)

డైరెక్టర్ కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. ఆ తర్వాత మగధీర, బృందావనం, చందమామ సినిమాలకు పని చేసాడు. ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమా డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేరాడు.

ఈ సమయంలో రాజ్ తరుణ్ కు ఒక సీన్ ఇచ్చి చేయమనగా రాజ్ తరుణ్ అందరికన్నా బాగా చేయడంతో అతనికి ఆ సినిమాలో అవకాశం  ఇచ్చారు. ఈ సినిమా హిట్ కావడంతో రాజ్ తరుణ్ వెనుదిరిగి చూడలేదు.

4. సందీప్ కిషన్(sandeep kishan)

డైరెక్టర్ వాసుదేవ దగ్గర అసిస్టెంట్ దగ్గర పనికి చేరాడు. స్నేహగీతం సినిమా ఆడిషన్స్ సమయంలో సందీప్ కిషన్ చేసిన యాక్టింగ్ కు సినిమాలో అవకాశం ఇచ్చారు.

ఈ సినిమా చేస్తున్న సమయంలో దేవ కట్టా అక్కడి వచ్చి సందీప్ కిషన్ యాక్టింగ్ కు ఆశ్చర్య పోయి తాను చేస్తున్న ప్రస్థానం సినిమాలో అవకాశం ఇచ్చాడు.

ఈ సినిమాలో అతనికి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత తెలుగులోనే కాకుండా హిందీలో కూడా హీరోగా చాలా సినిమాలు చేసాడు.

5. సిద్ధార్ధ(siddharth)

సిద్దార్ధ కన్నతల్ మిట్టల్ మిట్టల్ అనే సినిమాకు తమిళ డైరెక్టర్ మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. ఇదే సమయంలో బాయ్స్ సినిమాకు ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్లి ఆ సినిమాలో అవకాశం పొందాడు.

ఆ తర్వాత తెలుగులో నేరుగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలతో మంచి పేరు సంపాదించాడు.

6. నిఖిల్(nikhil)

2006లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. ఆ తర్వాత నితిన్ నటించిన సంబరం సినిమాలో 3 సెకండ్లు ఉండే క్యారెక్టర్ ను వేసాడు. ఆ తర్వాత  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీడేస్ లో నటించే అవకాశం వచ్చింది.

ఈ సినిమా మంచి హిట్ కావడంతో సినిమాల్లో హీరోగా నిలదొక్కుకున్నాడు. కార్తికేయ 2 తో పాన్   ఇండియా హీరోగా ఎదిగాడు.

7.నాని(nani)

రాధా గోపాలం సినిమాలో బాపు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. ఆ తర్వాత అష్టా చెమ్మా సినిమాలో డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి అవకాశం  ఇచ్చాడు.

ఆ తర్వాత భలే  భలే మగాడివోయ్ సినిమాతో మంచి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో వరుసగా 8 హిట్ సినిమాలు కొట్టిన హీరోల్లో నాని ఒకరు.

8. రవితేజ(ravi teja)

1997లో ఢైరెక్టర్ కృష్ణవంశీ దగ్గర తనకు అసిస్టెంట్ డైరెక్టర్ అవకాశం వచ్చింది. 1999లో నీ కోసం మూవీలో హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమాతో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు.

ఇది కూడా చదవండి..అతి తక్కువ వయసులో సినిమాలలోకి వచ్చి స్టార్ హీరోయిన్లు అయినది వీరే…