Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రమాదంతోనే స్పందిస్తారా..?

● ఆదమరిస్తే అంతే..
● ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్థంభం
● విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోని వైనం
చేవెళ్ల, ఆగష్టు 07 (నిజం న్యూస్) :
విద్యుత్ స్థంభం ఇండ్లను ఆనుకొని ఉన్నందున ప్రమాదం సంభవించే అవకాశం ఉందని విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన ఏలాంటి చర్యలు తీసుకోకపోడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చేవెళ్ల మండలంలోని అంతారం గ్రామంలోని ఎస్సీ కాలనీలోని మాస్టి నర్సిములు ఇంటికి ఆనుకుని విద్యుత్ స్థంభం ప్రమాదకరంగా ఉంది. పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి విద్యుత్ శాఖ అధికారులు పాత విద్యుత్ స్థంభానికి దగ్గరలోనే దాదాపుగా మూడేళ్ల క్రితం కొత్తగా స్థంభం ఏర్పాటు చేశారు.

మూడేళ్ళ క్రితం నుంచే కొత్తగా ఏర్పాటు చేసిన స్థంభం నుండి స్థానిక కుటుంబాలకు విద్యుత్ సప్లై అవుతుంది. కానీ పాత విద్యుత్ స్థంభాన్ని అక్కడి నుండి తీయలేదు.

పాత విద్యుత్ స్థంభం నుండి కూడా ఇప్పటికి ఇరుగు పొరుగు కుటుంబాలకు విద్యుత్ సప్లై అవుతూనే ఉంది. పాత విద్యుత్ స్థంభం ఇండ్లకు అనుకొని ఉండడంతో ఇంట్లో వారు విద్యుత్ శాఖకు గురై ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

అసలే వర్షాకాలం నీటి తేమతో ఆ ఇంటి వాళ్ళకు విద్యుత్ షాక్ వచ్చే ప్రమాదం ఉంది. ఇంటి పక్కన ఉన్న ఇతర ఇండ్ల వాళ్లకు కూడా కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంది. సమస్యను విద్యుత్ శాఖ అధికారులకు చాలా రోజుల నుండి మొర పెట్టుకున్నా ఏలాంటి స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు.

వారం రోజుల క్రితం స్థానికుడు మాస్టి ఆంజనేయులు నిజం న్యూస్ ను సంప్రదించగా సమస్యను గురించి లైన్ మెన్, ఏఈ లతో మాట్లాడగా రెండు మూడు రోజులలో పరిష్కారిస్తామని తెలిపారు.

వారం గడిచిన కూడా వారి నుండి ఏలాంటి స్పందన లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కావున ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి అక్కడ ఉన్న స్తంభాన్ని తీసివేయాలని స్థానికులు కోరుతున్నారు.