Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మహా వృక్షాలకు పునర్జన్మ

భారీ వర్షానికి నేలకొరిగిన రెండు మహావృక్షాలకు పునర్జన్మ

 విజయవంతంగా ట్రాన్స్ లొకేషన్

మణుగూరు ఆగస్టు 7 (నిజం న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యావరణ హిత చర్యలకు పెట్టింది పేరుగా ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మొక్కల పెంపుదలకు, వృక్షాల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.

ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఈదర గాలులకు కొత్తగూడెం హెడ్ ఆఫీస్ లో గల 6 దశాబ్దాల నాటి భారీ మర్రి వృక్షం ఒకటి నేలకు ఒరిగి పోగా  డైరెక్టర్ ఫైనాన్స్ మరియు పర్సనల్ ఎన్.బలరామ్ సూచనల మేరకు ఈ వృక్షాన్ని లోపలి వేర్లతో సహా జెసిబి తో పెకిలించి, భారీ క్రేన్ సాయంతో ట్రక్కులోనికి ఎక్కించి, కొత్తగూడెం బంగ్లోస్ ఏరియాలో ని గెస్ట్ హౌస్ ప్రదేశం కి ట్రాన్స్ లొకేట్ చేశారు.


అలాగే షటిల్ కోర్టుకు పక్కనే ఉన్న మరో 50 ఏళ్ల వయసున్న భారీ దిరిసినం వృక్షం నేలకు పడిపోగా దానిని కూడా ఇదే మాదిరిగా షటిల్ కోర్టు వెనుక వైపు కి ట్రాన్స్ లొకేట్ చేశారు .

గతంలో రామగుండం- 1 ఏరియా లో కూడా ఇదే విధంగా కొత్త ఓపెన్ కాస్ట్ గని ప్రాంతంలో గల పాతికేళ్ళ వయసుగల వృక్షాలను కూడా ఇదే విధంగా వేర్లతో సహా తొలగించి వేరే చోట ప్రతిష్టించడం జరిగింది.

ఇప్పుడు ఆ చెట్లు తిరిగి వృక్షాలుగా ఆరోగ్యంగా ఎదుగుతున్నాయి .

కొత్తగూడెంలో వృక్షాల పునః ప్రతిస్తాపనకు కృషి చేసిన అధికారులు సిబ్బందికి డైరెక్టర్ ఫైనాన్స్ మరియు పర్సనల్ ఎన్. బలరామ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.