యస్ జగన్, పోలీసు ఉద్యోగాల భర్తీని ప్రస్తావించారు.

శాఖలో ఇప్పటి వరకు ఉన్న ఖాళీలు, వీక్లీ ఆఫ్ దృష్ట్యా, అదనంగా కావాల్సిన సిబ్బందిని కూడా దృష్టిలో ఉంచుకుని పోలీసు ఉద్యోగాల భర్తీకి డిసెంబరులో నోటిఫై చేస్తూ, జనవరి నుంచి షెడ్యూల్ ఇవ్వాల్సిందిగా డీజీపీని కోరడం జరిగిందని సీఎం శ్రీ వైయస్ జగన్ వెల్లడించారు.
నాలుగు సంవత్సరాల్లో, నాలుగు దశల్లో ఏటా 6500 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చామని, అదే విధంగా గత మూడు సంవత్సరాలుగా పోలీసు సంక్షేమ నిధికి ఇవ్వాల్సిన నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
ఉక్కుపాదం మోపండి :
రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే అసాంఘిక శక్తుల మీద, లంచగొండితనం, అవినీతి, రౌడీయిజమ్, నేర ప్రవర్తన వంటి వాటి మీద నిజాయితీగా, నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదం మోపాలని సీఎం శ్రీ వైయస్ జగన్ స్పష్టం చేశారు.
చివరగా..
పోలీసు అమర వీరుల కుటుంబాలకు సంపూర్ణ న్యాయం చేస్తామన్న మాట ఇస్తూ, అమరులైన ప్రతి ఒక్కరి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు మంచి జరగాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ సెలవు తీసుకుంటున్నానంటూ ముఖ్యమంత్రి తన ప్రసంగం ముగించారు.
హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో పాటు, పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.