నకిలీ పత్రాలతో ఉద్యోగం బదిలీ
నకిలీ పత్రాలతో ఉద్యోగం బదిలీ
కురవి తహసీల్దార్ సహకారంతో ఫోర్జరీ సంతకాలు..
చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు పిర్యాదు గండమల్ల యాకమ్మ.
కురవి,నిజంచెపుతాం,ఆగస్టు,07:
కురవి తహశీల్దార్ సహకారంతో నకిలీ పత్రాలపై ఫోర్జరీ సంతకాలతో విఆర్ఏ ఉద్యోగం బదిలీ చేశారని గండమల్ల యాకమ్మ సోమవారం జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసారు.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా గాందీపురం గ్రామానికి చెందిన గండమల్ల యాకమ్మ కురవి మండలంలోని మోదుగులగూడెం గ్రామానికి చెందిన తన తండ్రి చింతమల్ల వీరన్న సంతానం నలుగురు కుమార్తెలు తన తండ్రి గ్రామంలో విఆర్ఏగా ఉద్యోగం చేస్తున్నాడు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏలకు రెగ్యులర్ చేసి ప్రభుత్వ వివిధ శాఖకు ఉద్యోగం కల్పిస్తున్నారు.దీంతో తన తండ్రి వీరన్న కురవి తహశీల్దార్ సహకారంతో కుటుంబ సభ్యుల అంగీకార పత్రంలో తమ సంతకాలను ఫోర్జరీ చేసి నలుగురు కూతుళ్ళలో ఒక్క కుమార్తెకే ఉద్యోగం బదిలీ చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
అంతేకాకుండా తన తండ్రి ఆధార్ కార్డులో 57 సంవత్సరాల వయస్సు ఉండగా 67 సంవత్సరాలు ఉన్నట్లుగా తప్పుడు ఆధార్ కార్డు సృష్టించి వి.ఆర్.ఎ ఉద్యోగం చేస్తున్న తమ తండ్రి యొక్క ఆధార్ కార్డులో వయస్సు మార్పిడిచేసి తన ఉద్యోగాన్ని నలుగురి కుమార్తెల్లో ఒక కుమార్తె ఉద్యోగం బదిలీ చేస్తున్నారు.
అలాగే నకిలీ ఆధార్ కార్డు నమోదు చేయడమే కాకుండా సర్విస్ పుస్తకంలో 61సంవత్సరాలు నిండినట్లు గా వయస్సు నమోదు చేసి ఉద్యోగంలో చేర్పించడం జరిగింది. ఇలా దొంగ సర్టిఫికేట్ నమోదు చేసి మోసం చేయడం జరిగింది.
అదేవిధంగా నో అబేషన్ సర్టివికేట్ కూడా పోర్జరీ సంతకం చేసి ఇష్టమైన ఒక్క కూతురు కే ఉద్యోగం బదిలీ చేస్తున్నారని సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసినట్లు గండమల్ల యాకమ్మ పేర్కొన్నారు.