Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అతి తక్కువ వయసులో సినిమాలలోకి వచ్చి స్టార్ హీరోయిన్లు అయినది వీరే…

సినిమా ఇండస్ట్రీ లోకి చాలామంది హీరోయిన్లు హీరోలు వస్తూ ఉంటారు. అతి తక్కువ వయసులో సినిమాలలోకొచ్చి వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అలాగే స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్లుగా అవుతున్నారు.. అతి తక్కువ వయసులో సినిమాలలో కొచ్చి స్టార్ హీరోయిన్ అయిన వారు వీరే…

శ్రీ లీల…

2021 జూన్ 14న గౌరీ రొనంకి దర్శకత్వంలో విడుదలైన పెళ్లి సందడి సినిమాతో శ్రీ లీల తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు..

శ్రీ లీల 18 సవత్సరాల వయసులో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వచ్చారు..

అతి తక్కువ వయసులోనే తన నటనతో గ్లామరస్ లుక్స్ తో మంచిగా నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంది.. అలాగే అతి తక్కువ వయసులోనే మంచి సినిమాలు మంచి నటనతో స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకుంది…

సయేషా సైగల్…

2017 అక్టోబర్ 22న డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో విడుదలైన అఖిల్ ది పవర్ ఆఫ్ జువ్వ సినిమాతో సయ్యేశ సైగల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.. సయేషా సైగల్ 17 సంవత్సరాలకే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది..

అలాగే ఈ సినిమా విడుదలై మంచి కలెక్షన్ మంచి పేరును రాబట్టింది…

నందితరాజ్…

నందితా రాజ్ 2012 ఏప్రిల్ 12న విడుదలైన నీకు నాకు డాష్ డాష్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై 17 సంవత్సరాలకే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది..

ఛార్మి కౌర్…

2002, 28 మార్చ్ డైరెక్టర్ భీమినేని శ్రీనివాస్ రావు దర్శకత్వంలో వచ్చిన నీ తోడు కావాలి అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

అలాగే 17 సంవత్సరాలకే ఛార్మి కౌర్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది..

అలాగే ఈ సినిమాతో పరిచయం  తన అందంతో, గ్లామర్స్ లుక్స్ తో ప్రేక్షకులను అలరించి స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని పొందింది.. స్టార్ హీరోలతో నటించి లక్కీ హీరోయిన్గా పేరుపొందిన వారిలో చార్మి ఒకరు..

అవికా గోర్…

అవికా గోర్ 2013 డిసెంబర్ 25న విరించి వర్మ దర్శకత్వంలో వచ్చిన ఉయ్యాల జంపాల సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది..

అలాగే చిన్న చిన్న సీరియల్స్ లో నటించి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. అవికా గోర్ 16 సంవత్సరాల కు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది.. ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించి అవికా గోర్ కు మంచి గుర్తింపు తెచ్చింది..

శ్వేతాబసు ప్రసాద్…

శ్వేతా బసు ప్రసాద్ 2008 అక్టోబర్ 9న డైరెక్టర్ శ్రీకాంత్ దశకత్వంలో వచ్చిన కొత్త బంగారు సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.. శ్వేతా బసు ప్రసాద్ 16 సంవత్సరాలకే సినిమా ఇండస్ట్రీలో కొచ్చి కొత్త బంగారులోకం సినిమాతో తనకంటూ గుర్తింపు ఏర్పరచుకొని అప్పట్లో ఈ సినిమాతో చాలామంది యువతకు ఈ సినిమా నచ్చింది…

హన్సిక..

హన్సిక 2007 జనవరి 12న డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు సినిమాలో హీరోయిన్గా నటించిన తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది..

ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించి హీరోయిన్ హన్సిక కు ఎన్నో సినిమాలు తెచ్చిపెట్టింది.. అలాగే ఎంతో మంది స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని పొందింది..

హన్సిక 16 సంవత్సరాలకే సినీ ప్రవేశం చేసింది…

కృతి శెట్టి…

కృతి శెట్టి 17 సంవత్సరాల వయసులో డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాలో హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఉప్పెన సినిమాలో తనదైన స్టైల్ లో నటించి స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది..

అలాగే ఉప్పెన సినిమా విడుదలై 100 కోట్లు కలెక్షన్లు రాబట్టి గణ విజయం సాధించింది.. ఈ సినిమాతో కృతి శెట్టి స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వచ్చాయి..