Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నేటి నుండి 10 వరకు గృహలక్ష్మి పథకం దరఖాస్తుల స్వీకరణ

నేటి నుండి గృహలక్ష్మి పథకం దరఖాస్తుల స్వీకరణ

జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

మంచిర్యాల జిల్లా ప్రతినిది ఆగస్టు 06 (నిజం చెపుతాం) న్యూస్ మంచిర్యాల టౌన్

మంచిర్యాల, ఆగస్టు06,
సోమవారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు గృహలక్ష్మి పథకం దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

సొంత ఇంటి స్థలం కలిగి ఉండి ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేని వారికి ప్రభుత్వం ఇల్లు నిర్మించుకునేందుకు 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు గృహ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, పథకం అమలుకు మార్గదర్శకాలను జారీ చేసిందని తెలిపారు.

జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు 9 వేల 400 ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని, గృహలక్ష్మి పథకం లబ్ధి కోసం అవసరమైన వారు చేసుకోవాలని తెలిపారు.

జిల్లాలోని తహసిల్దార్, మున్సిపల్ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక గృహలక్ష్మి కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, అర్హత గల అభ్యర్థులు సకాలంలో దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.