Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఎస్సై పోస్ట్ సాధించిన… గట్టు శృతి

237మార్కుల తో సివిల్ లో ….ఎస్సై పోస్ట్

తుంగతుర్తి ఆగస్టు6 నిజం చెపుతాం న్యూస్

తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన గట్టు దేవేందర్ హేమలత కుమార్తె గట్టు శృతికి సివిల్ 237 మార్కులు రావడంతో సివిల్ లో మొదటిసారిగా ఎస్ఐ పోస్టు సాధించినట్లు ఆమె ఆనందంతో పేర్కొన్నారు.

1 నుండి పదవ తరగతి వరకు తుంగతుర్తి ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ హనుమకొండలోని ఎస్వీ కాలేజీలో, ఇంజనీరింగ్ లో జేఎన్టీయూలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఈసీఈ పూర్తి చేసినట్లు తెలిపారు.

అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సై పోస్టులు దరఖాస్తు చేసుకోగా, కష్టపడి చదివి237 మార్కులు సాధించడంతో, సివిల్ లో ఎస్సై పోస్ట్ సాధించినట్లు ఆమె తెలిపారు.

తన తల్లిదండ్రులు టైలర్ వృత్తిలో రాణిస్తూ కష్టపడి చదివించడంతో, తాను ఉద్యోగం పొందానని, ఇది అమ్మానాన్నల గిఫ్ట్ గా జీవితంలో మర్చిపోలేను.

సమాజములను పేద ప్రజలకు సేవ చేయుట తన లక్ష్యమని తెలిపారు. ఎస్సై పోస్ట్ సాధించడం పట్ల తుంగతుర్తి మండల ప్రజలు మేధావులు బంధువులు హర్షం వ్యక్తం చేశారు.