Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మెళ్ళూరు గ్రామంలో వికసించిన బ్రహ్మకమలం పుష్పాలు

తూర్పుగోదావరి జిల్లా (మెళ్ళూరు)

ఆగష్టు 6.. నిజం న్యూస్..

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం మెళ్ళూరు గ్రామంలో శనివారం రాత్రి కొక్కిరిమెట్ల వీరలక్ష్మి ఇంటి ఆవరణలో బ్రహ్మకమలం పువ్వులు రెండు వికసించాయి.

ఆకులనుండే మొగ్గలు ఏర్పడే ఈ అరుదైన పుష్పం శివునికి అత్యంత ఇష్టమైనదిగా భక్తులు భావిస్తారు. సాధారణంగా హిమాలయపర్వతాల ప్రాంతం మరియు ఉత్తర భారతదేశంలో బ్రహ్మకమలాలు ఎక్కువగా కనిపిస్తాయి.

కాని ఇటీవల ఇవి సరైన జాగ్రత్తలు తీసుకుంటే మన ప్రాంతాల్లో కూడా పుష్పిస్తున్నాయి.రాత్రి సుమారు 10 గంటల సమయం నుండి వికసించడం ప్రారంభించిన ఈ బ్రహ్మకమలం పువ్వులు సుమారు అర్దరాత్రి వరకు నిండుగా వికసించి వీక్షకులకు కనువిందు చేసాయి. స్థానికులు ఈ పుష్పములను ఆసక్తిగా తిలకించారు.