Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తుంగతుర్తి లో డెలివరీ వికటించి పాప మృతి

 

తుంగతుర్తి ఆగస్టు 5 నిజం చెపుతాం న్యూస్

తుంగతుర్తి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఆపరేషన్ వికటించి డెలివరీ అయిన పాప మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది.

తాటిపాముల శ్రీలత రెండవ డెలివరీలో ఆపరేషన్ చేసే డాక్టర్లు లేకపోవడంతో హెడ్ సిస్టర్లు డెలివరీ చేస్తుండగా వైద్యం వికటించి పాప మృతి చెందింది.

తమకు ఏమీ తెలియదు అన్నట్టు సూర్యాపేట ఏరియా హాస్పిటల్ పంపగా అప్పటికే పాప చనిపోయి ఉందని వారు తెలపడంతో కుటుంబ సభ్యులు రోదనకు గురయ్యారు.

కనీసం నైకాలజిస్ట్ అందుబాటులో లేకుండా, డెలివరీ చేయడం దురదృష్టకరమైన విషయం కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జరిగిన సంఘటనపై జిల్లా ఉన్నత అధికారులు పూర్తి విచారణ జరిపి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు