Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సినిమాల తర్వాత పేర్లు మార్చుకున్న హీరోలు వీరే…

టాలీవుడ్ ఇండస్ట్రీలో సహజంగా హీరోల పేర్ల ముందు బిరుదులు ఉండడం సహజమే.. కానీ కొంతమంది హీరోలకు మాత్రం వారు తీసిన సినిమాలు హిట్ అయి వారి పేరుకు ముందు పేరు పెట్టుకున్న హీరోలు వీరే..

మెగాస్టార్ చిరంజీవి..

మెగాస్టార్ చిరంజీవి 1988 ఆగస్టు 8న విడుదలైన మరణం మృదంగం సినిమా తో చిరంజీవి గారి పేరు మార్చుకున్నారు. మరణ మృదంగం సినిమా కన్నా ముందు సుప్రీం హీరోగా చిరంజీవి గారు మరణం మృదంగం సినిమా మంచి హిట్ అయి ఆ సినిమాతో మెగాస్టార్ చిరంజీవిగా పేరు వచ్చింది…

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్…

పుష్ప సినిమా కన్నా ముందు స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్.. 2021 డిసెంబర్ 17న డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైస్ సినిమాతో స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా పేరు పొందారు..

నట సింహం బాలకృష్ణ…

యువరత్న పేరున్న నందమూరి బాలకృష్ణ 2010 ఏప్రిల్ 30న బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సింహ  సినిమాతో నటసింహ బాలకృష్ణ గా పేరుపొందారు..

అలాగే ఈ సినిమా విడుదల ఘన విజయం సాధించింది..

అక్కినేని నాగార్జున…

యువ సామ్రాట్ గా ఉన్న అక్కినేని నాగార్జున 2008 డిసెంబర్ 25న శ్రీను వాట్ల దర్శకత్వంలో విడుదలైన కింగ్ సినిమాతో కింగ్ నాగార్జున గా పేరు పొందారు..

మహేష్ బాబు..

ప్రిన్స్ మహేష్ బాబు 2006 ఏప్రిల్ 28న దర్శకత్వంలో విడుదలైన పోకిరి సినిమాతో ప్రిన్స్ మహేష్ బాబు గా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు గా పేరు పొందారు…

రెబల్ స్టార్ ప్రభాస్…

రెబల్ స్టార్ ప్రభాస్ 2015 జులై 10న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన బాహుబలి ది బిగినింగ్  సినిమా ప్రభాస్ కు మంచి పేరు తేవడమే కాకుండా ఈ సినిమా ఘన విజయం సాధించింది.. అప్పటివరకు రెబల్ స్టార్ గా ఉన్న ప్రభాస్ ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా పేరు మార్చుకున్నారు..

మాస్ మహారాజ్ రవితేజ…

మాస్ హీరోగా ఉన్న రవితేజ 2010 ఆగస్ట్ 6న డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో విడుదలైన డాన్ శీను సినిమాతో మాస్ హీరోగా ఉన్న రవితేజ మాస్ మహారాజుగా పేరుపొందారు.. అంతేకాకుండా ఈ సినిమా 100 రోజులు థియేటర్ల వద్ద కలెక్షన్ వసూలు చేసింది…