Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

విడుదలైన అన్ని కేంద్రాలలో డైరెక్ట్ గా 100 రోజులు ఆడిన చిత్రాలు మూడే

తెలుగు సినిమా ప్రారంభమై 91 సంవత్సరాలు గడిచాయి. ఈ 91 సంవత్సరాలలో ఎన్నో వేల సినిమాలు విడుదల అయ్యాయి. వాటిలో విజయవంతం అయిన సినిమాల కంటే పరాజయం పాలైన సినిమాలే ఎక్కువ.

చాలా సినిమాలు  శత దినోత్సవాలు, సిల్వర్ జూబ్లీలు, గొల్డెన్ జూబ్లీలు, డైమండ్ జూబ్లీలు జరుపుకున్న సినిమాలు కూడా ఉన్నాయి.

కాని విడుదలైన అన్ని కేంద్రాలలో థియేటర్ మారకుండా డైరెక్ట్ గా 100 రోజులు ఆడిన చిత్రాలు కొన్నే కన్పిస్తున్నాయి. అవేంటో చూద్దాం.

1. లవకుశ

తెలుగు సినీ చరిత్రలో మొట్టమొదటి రంగుల సినిమా. 1963 మార్చి 29 తేదీన విడుదల అయింది. మొదటి రిలీజ్ లో 26 కేంద్రాలలో విడుదల అయింది. లేట్ రిలీజ్ లో మరో 46 కేంద్రాలలో విడుదలై విడుదలైన అన్ని థియేటర్లలో 100 రోజులు ప్రదర్శించబడింది.

బాక్సాఫీస్ వద్ద ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం తెలుగులో కోటి రూపాయలు వసూలు చేసిన తొలి చిత్రం గా నిలిచింది..

2. ప్రేమాభిషేకం…

1981లో రిలీజై విడుదలైన 30 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ సినిమా అప్పట్లో 4.50 కోట్లను వసూలు చేసి రికార్డులు నెలకొల్పింది. ఈ రికార్డు 1980 లో చిరంజీవి సినిమా పసివాడి ప్రాణం విడుదలయ్యే వరకు ఉంది.

3. కలిసుందాం రా…

2000 జనవరి 14న వెంకటేష్, సిమ్రాన్ జంటగా నటించిన కలిసుందాం రా సినిమా 76 కేంద్రాలలో విడుదలై అన్ని కేంద్రాల్లో 100 రోజులు ఆడి రికార్డులు నెలకొల్పింది.