Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

భూపాల్ నాయక్ పై బురద జల్లే ప్రయత్నాలు

భూపాల్ నాయక్ రాజకీయ జీవితం పై దెబ్బతీయాలనే ప్రయత్నాలు

డబ్బుకు అమ్ముడుపోయి తప్పుడు ప్రచారాలు

ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా డోర్నకల్ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు

డోర్నకల్ లో జెండా పాతడానికి భూపాల్ నాయక్ రంగం సిద్ధం

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి ఆగస్టు 4 నిజం న్యూస్

ఎవరు ఈ భూపాల్ నాయక్? డోర్నకల్ నియోజకవర్గంలో ఎస్టి, ఎస్సి, బిసి, బలహీన వర్గాలకు చెందిన ప్రజలను ఎవరిని అడిగినా ఎవరు ఈ భూపాల్ నాయక్ అని అడిగితే వారు చెపుతారు.

గత రెండు నెలల నుండి ప్రత్యర్థి వర్గాల పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈ భూపాల్ నాయక్ ఎవరో తెలియదంటే హాస్యాస్పదంగా ఉంది.

తిరిగిన మండలాన్ని తిరగకుండా నియోజకవర్గం వారి కష్టాలలో పాలు పంచుకుంటూ ప్రజాభిమానాన్ని చూడగొంటూ తనదైన మార్కు వేస్తున్న భూపాల్ నాయక్ మీద బురదజల్లే ప్రయత్నం మొదలైంది.

అది కాంగ్రెస్ పార్టీ నుండి, అందులోనూ స్వజాతి అయిన బంజారాలనుండి విమర్శ రావడం, ఒక వ్యక్తి మీద ఇలాంటి దిగజారుడు భాషను ఉపయోగించడం, ఎప్పటివో మార్ఫింగ్ చేసిన వీడియోలు పెట్టి భూపాల్ నాయక్ ను డోర్నకల్ నియోజకవర్గ ప్రజల అభిమానానికి దూరం చేయలేరని వారు గ్రహించాలి.

ఒకవేళ వారు పెట్టిన వీడియోలు నిజమైనవే అయినా అవి ఈ దేశంలోనివి కావు. ఇలాంటి వీడియోలు ప్రచురించి సంబంధం లేని వార్తలు రాసినంత మాత్రాన డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు నమ్మరు గాక నమ్మరు.

ప్రజలకు సేవ చేయడానికి ఎక్కడి వా డో కావలసిన అవసరం లేద భారతదేశానికి సంబంధించిన వాడైతే చాలు. మహబూబ్నగర్ వ్యక్తి డోర్నకల్ లో పోటీ చేయవద్ద? మహబూబ్నగర్ వ్యక్తి అని మీరే అంటున్నారు. ఈ దేశపు ఓటర్ కార్డు ఉందా అంటున్నారు .ఎంత అమాయకులు సార్ మీరు.

ఎక్కడో విదేశాలలో జరిగిందో! లేదో? తెలియని మీరు ఇలాంటి వీడియోలను ప్రదర్శించడం మీ దిగజారుడు, తెలివి తక్కువ తనానికి నిదర్శనం.

కిరాతకుడైన వాల్మీకి రామాయణం రాసి చరిత్రకి ఎక్కలేదా? ఆ మహా పురుషుడు రాసిన రామాయణాన్ని ఈనాటికీ మనం చదువుతున్నాం. ఎప్పుడో, ఎక్కడో ( మన దేశం కాదు) జరిగిన దానిని ఇక్కడ ప్రదర్శిస్తే డోర్నకల్ ప్రజలు ఆలోచన లేనంత వారు కాదు.

ఎవరిని ఆదరించాలో ఎవరికి బుద్ధి చెప్పాలో డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు. మీరు భూపాల్ నాయక్ పై ఎంత బురద చల్లే ప్రయత్నం చేస్తే అతనికి అంత మంచిది.

ఎవరి భూపాల్ నాయక్ అని అతని గురించి నియోజకవర్గ ప్రజలు ఆలోచిస్తారు. డోర్నకల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని ప్రజలను కలుస్తారని భూపాల్ నాయక్ సన్నిహితులు అంటున్నారు.

ఈరోజు భూపాల్ నాయక్ వెంట కొంతమంది ఉండవచ్చు. కానీ రాబోయే కాలంలో డోర్నకల్ నియోజకవర్గ ప్రజలందరూ ఉంటారని మీరు తెలుసుకుంటే మంచిది.