Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కరడు గట్టిన ATM దొంగ అరెస్ట్….

మంగళవారం ఉదయం భద్రాచలం సిఐ స్వామి, భద్రాచలం ఎస్ఐ మహేష్, వారి సిబ్బంది తో భద్రాచలం SBI బ్యాంకు ATM వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండగా అతనిని పట్టుకొని విచారించగా తన పేరు బానాల. ప్రశాంత్
S/O గోపాల్, 26 సంవత్సరాలు, గాంధీనగర్ గ్రామం, భూపాలపల్లి జిల్లా.
ఇతను డిగ్రీ మధ్యలో చదువు ఆపేసి జల్సాలకు అలవాటు పడి ATM దొంగతనాలకు అలవాటు పడినాడు. ఎవరైనా ముసలి వాళ్ళు ATM సెంటర్లలో డబ్బులు డ్రా చేయడానికి వస్తే డబ్బులు తీసి ఇస్తానని నమ్మించి ATM కార్డ్ మెషీన్ లో పెట్టి వాళ్ళు పిన్ నెంబర్ చెప్పగానే డబ్బులు రావడం లేదు అని చెప్పి అతని దగ్గర ఉన్న వేరే ATM ను వాళ్లకు ఇచ్చి అట్టి ATM కార్డ్ తీసుకుని వేరే ATM ల దగ్గరకు వెళ్లి విత్ డ్రా చేస్తాడు. అలాగే SBI కస్టమర్ సర్వీస్ సెంటర్ లకు వెళ్లి విత్ డ్రా చేస్తాడు. భద్రాచలం లో తేదీ 07.08.2020 నాడు రమణ అనే వ్యక్తి ATM కార్డ్ SBI మెయిన్ బ్రాంచ్ ATM సెంటర్ వద్ద తీసుకుని అతని అకౌంట్ లో నుండి 45,000/- రూపాయలు తీసుకున్నాడు. ఇతని పై గతంలో కూడా చాలా కేసులు ఉన్నవి. పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.