Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగి నిర్లక్ష్యంతో రైతన్నల పరేషాన్

ఉన్నతాధికారులు చొరవ చూపి ఆదుకోవాలని రైతుల వేడుకోలు
మాడ్గుల ఆగస్టు 03 ( నిజం చెపుతా):
మండల కేంద్రమైన మాడ్గుల ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్ సీఈఓ నిర్లక్ష్యం వల్ల వడ్లు అమ్ముకొని డబ్బుల కోసం నిరీక్షిస్తున్నామని ఇటీవల కొంతమంది రైతులకు అకౌంట్లో డబ్బులు పడగా సుమారు 45 మంది రైతులకు సీఈవో చేసిన తప్పిదంతో ఇబ్బందులు పడుతున్నట్లు రైతు లాలు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వము వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా మాడుగుల కోఆపరేటివ్ బ్యాంక్ కొనుగోలు కేంద్రానికి వడ్లను అమ్మిన నాతో పాటు అనేకమంది రైతులకు నేటి వరకు సుమారు 46 లక్షల రూపాయల బిల్లులు పెండింగ్ లో అధికారి నిర్లక్ష్యం వల్ల ఉన్నాయని లాలునాయక్ అన్నారు.
జులై 15 వరకు వడ్ల కొనుగోలు సంబంధించిన వివరాలను అప్లోడ్ చేయాల్సి ఉండగా కొనుగోలు కేంద్రంలో సీఈఓ తదితరులు నిర్లక్ష్యం చేయడంతో 45 మంది రైతుల పేర్లు నమోదు కాలేదని దాంతోనే మాకు డబ్బులు రావడంలేదని

విషయం తెలిసి సంబంధిత అధికారులను సంప్రదిస్తే రైస్ మిల్లు యజమానులతోనూ ఇతరత్రా ఏ విధంగానైనా మీకు డబ్బులు ఇప్పిస్తానని మాయమాటలు చెబుతున్నారు గాని నేటి వరకు ఇవ్వడం లేదని దీనిపై సంబంధిత జిల్లా ఉన్నత అధికారులు స్పందించి 45 మంది రైతుల సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.