Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఈ హీరోయిన్ల ఫస్ట్ సినిమా పారితోషికం ఎంతో తెలుసా…

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు కోట్లల్లో పారితోషికం తీసుకుంటూ ఉంటారు. కానీ వారి మొదటి సినిమాకి వారు తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా..

కృతి శెట్టి..

 

2021 ఫిబ్రవరి 12న విడుదలైన ఉప్పెన సినిమాతో కృతి శెట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.. ఈ సినిమాలో మెగా హీరో వైష్ణవ తేజ్ కృతి శెట్టి విజయ్ సేతుపతి ముఖ్యపాత్రులు పోషించారు.. ఈ సినిమా మంచి ఘన విజయం సాధించి 100 కోట్లు బాక్సాఫీస్ వద్దా రాబట్టింది.. సినిమాకి డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహించారు..

ఈ సినిమాకి ప్రతి శెట్టి 6 లక్షల రూపాయలు పారితోషికం తీసుకుంది..

పాయల్ రాజ్ పుత్…

పాయల్ రాజ్ పుత్ 2018 జులై 12న విడుదలైన RX 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.. ఈ సినిమా పూర్తిగా రొమాన్స్ అండ్ యాక్షన్ సినిమాగా ఉంటుంది. ఈ సినిమాని కార్తికేయ క్రియేటివిటీ వర్క్స్ బ్యానర్ లో నిర్మించారు. ఈ సినిమా విడుదల ఘనవిజయం సాధించి 27 కోట్లు కలెక్షన్ రాబట్టింది..

ఈ సినిమాలో నటించినందుకు గాను పాయల్ రాజ్ పుత్ కు మూడు లక్షల రూపాయలు ఫస్ట్ శాలరీగా ఇచ్చారు..

సదా…

 

2002 జూన్ 14న విడుదలైన జయం సినిమాతో హీరోయిన్ సదా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.. ఈ సినిమా పూర్తిగా డ్రామా అండ్ లవ్ స్టోరీ గా ఉంటుంది. ఈ సినిమాకి డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోగా నితిన్ మరియు సదా, విలన్ గా గోపీచంద్ ముఖ్యపాత్రలు పోషించారు.. ఈ సినిమా విడుదలై 3 కోట్ల 20 లక్షలు కలెక్షన్లు సాధించింది.

అయితే ఈ సినిమాకి సదాకు 11 వేల రూపాయలు పారితోషికం ఇచ్చారని అంతేకాకుండా తనతో పని చేసిన నటలందరికి కూడా 11 వేల రూపాయలు ఇచ్చారని చెప్పారు..