తుది దశకు పులుసుబొంతభూసేకరణ *ఇరిగేషన్ ఏఈఈ శక్రు నాయక్

రాష్ట్ర విప్ ,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు చిరకాల వాంఛ పులుసుబొంత ప్రాజెక్టు కి సంబంధించిన భూ సేకరణ తుది దశకు చేరినట్లు ఇరిగేషన్ ఏఈఈ శక్రు నాయక్ మన్యం టీవి కి తెలిపారు. దుమ్ము గూడెం మండలంలో ఫారెస్ట్ శాఖ కు అప్పగించనున్న 140 ఎకరాల భూమి కి సందించి దస్త్రం ఎఫ్ ఆర్వో అనుమతి నేపథ్యంలో ఏటూరి నాగరం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంకి వెళ్లినట్లు ఏఈఈ తెలిపారు. సంబంధిత ఫైల్ విషయమై ఎఫ్ఆర్ఓ ని కలవడం జరిగిందని మరో మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని దీనితో పులుసుబొంత భూసేకరణ తుది స్థాయికి చేరినట్లే అని ఇరిగేషన్ ఏఈఈ శక్రు నాయక్ తెలిపారు.