Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రీ రిలీజ్ అయి ఎక్కువ కలెక్షన్ చేసిన సినిమాలు ఇవే…

టాలీవుడ్ ఇండస్ట్రీలో సంవత్సరానికి ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. మంచి కలెక్షన్లు కూడా సాధిస్తూ ఉంటాయి. కానీ రీ రిలీజ్ చేసిన అధిక స్థాయిలో కలెక్షన్లు మాత్రం కొన్ని సినిమాలకే సాధ్యం… ఆ సినిమాలు మళ్లీ రిలీజ్ చేసిన అదే స్థాయిలో కలెక్షన్లు సాధించిన సినిమాలు ఇవే….

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి…

 

2001 వ సంవత్సరం ఏప్రిల్ 26న విడుదల ఖుషి సినిమా ఘన విజయం సాధించింది.. డైరెక్టర్ ఎస్ జె సూర్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ భూమిక ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు.. 2001లో విడుదలైన ఈ సినిమా 58 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది..

మళ్లీ ఈ సినిమాను 2022 డిసెంబర్ 31న ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు.. ఈ సినిమాను రీ రిలీజ్ చేసిన ఘన విజయం సాధించి 5కోట్ల 50 లక్షల రూపాయలు కలెక్షన్ సాధించింది..

రి రిలీజ్ చేసిన సినిమాలలో మొదటి స్థానంలో ఖుషి సినిమా ఉంది..

సింహాద్రి…

సింహాద్రి సినిమా 2003 జూన్ 19న విడుదలై ఘన విజయం సాధించింది.. ఈ సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు.. సింహాద్రి సినిమా 2003లో విడుదలై 25 కోట్ల 70 లక్షల కలెక్షన్లు సాధించింది.. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ భూమిక చావ్లా ముఖ్యపాత్రను పోషించారు…

సింహాద్రి సినిమాను 2023 మే 24 ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా రిలీస్ చేశారు.. ఈ సినిమా రి రిలీజ్ ఐదు కోట్ల 20 లక్షల రూపాయలు కలెక్షన్ రాబట్టింది..

రీ రిలీజ్ అయి అధిక వసతులు రాబట్టిన సినిమాలలో సింహాద్రి సినిమా 2వ స్థానం లో ఉంది..

..జల్సా…

జల్సా సినిమా 2008 ఏప్రిల్ 2న విడుదల ఘన విజయం సాధించింది.. ఈ సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ వారు నిర్మించారు.. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇలియానా, బ్రహ్మానందం ,ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రులు పోషించారు. సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.. ఈ సినిమా పూర్తిగా యాక్షన్  కామెడీగా ఉంటుంది.. ఈ సినిమా 2008లో విడుదలై 16 కోట్ల ఐదు లక్షల కలెక్షన్లు రాబట్టింది..

ఈ సినిమాను మళ్ళీ 2022 సెప్టెంబర్ 3న రీ రిలీజ్ చేశారు.. ఈ సినిమా రియల్ చేసిన 3 కోట్ల 25 లక్షల కలెక్షన్ రాబట్టింది..

రీ రిలీజ్ అయ్యి అధిక వసులో రావట్టిన సినిమాలలో జల్సా సినిమా 3వ స్థానంలో ఉంది..

ఒక్కడు..

ఒక్కడే సినిమా 2003 జనవరి 15 విడుదలై ఘన విజయం సాధించింది.. ఈ సినిమాలో మహేష్ బాబు భూమిక చావ్లా ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్ర పోషించారు.. ఈ సినిమా డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు.. ఈ సినిమా విడుదలై 24 కోట్ల కలెక్షన్లు సాధించింది..

మళ్లీ ఈ సినిమాను 2023 జనవరి 7న రిలీజ్ చేశారు..

ఈ సినిమా రి రిలీజ్ అయి 2 కోట్ల 14 లక్షల కలెక్షన్ రాబట్టింది.. ఒక్కడు సినిమా రీ రిలీజ్ అయ్యి అధిక వసూలు రాబట్టిన సినిమాలలో ఒక్కడు సినిమా 4వ స్థానంలో ఉంది..

ఆరెంజ్..

ఆరెంజ్ సినిమా 2010 నవంబర్ 22 విడుదలై ఘన విజయం సాధించి 20 కోట్ల రూపాయల కలెక్షన్ రావట్టింది.. ఈ సినిమా మొత్తం రొమాంటిక్ లవ్ స్టోరీ గా ఉంటుంది.. ఈ సినిమాలో రామ్ చరణ్ ,జెనీలియా ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషించారు..

ఆరెంజ్ సినిమాను 2023 మార్చ్ 20న రీ రిలీజ్ చేశారు.. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజై ఘనవిజయం సాధించి ఒక కోటి 60 లక్షలు కలెక్షన్ రాబట్టింది..

రీ రిలీజ్ అయి అధిక వసూలు సాధించిన సినిమాలలో ఆరెంజ్ సినిమా 5వ స్థానంలో ఉంది..