Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రూ.100 కోట్లను వసూలు చేసిన తెలుగు వర్షన్ సినిమాలివే

ఒకప్పుడు 100 కోట్లను వసూలు చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. ప్రస్తుత కాలంలో పెద్ద సినిమాలకు అది పెద్ద కష్టంగా అనిపించడం లేదు.

తెలుగులో ఇప్పటి వరకు రూ. 100 కోట్లను వసూలు చేసిన సినిమాలు 16 ఉన్నాయి. వాటిని ఒక సారి పరిశీలిద్దాం. ఇవన్నీ తెలుగు వర్షన్ లోనే రూ. 100 కోట్లను వసూలు చేసాయి.

వీటిలో ప్రభాస్, మహేష్ బాబువి చెరో 4 సినిమాలుండగా, చిరంజీవి 3 సినిమాలు ఉన్నాయి. అల్లు అర్జున్, రాంచరణ్ వి చెరో రెండు,  ఎన్టీఆర్ ఒక సినిమాలున్నాయి.

1. ఆర్ ఆర్ ఆర్(RRR):

ఈ సినిమా టాలీవుడ్ లో 365 కోట్ల షేర్ ను సాధించి మొదట స్థానంలో నిలిచింది. ఈ సినిమాకు ఏ ఇతర మూవీ షేర్ లు దరిదాపులో కూడా లేవు.

2. బాహుబలి-2 (BHAHUBALI-2): 

బాహుబలి-2  310 కోట్లను వసూలు చేసింది. ఆర్ ఆర్ ఆర్ కు  ముందు ఈ సినిమాదే తెలుగు వర్షన్ రికార్డు ఉండేది.

3. బాహుబలి -1(BHAHUBALI-3): 

బాహుబలి -1 రూ. 185 కోట్లను వసూలు చేసి మూడో స్థానంలో ఉంది.

4. అలా వైకుంటపురంలో(ALA VAIKUNTAPURAM LO)…160 కోట్ల ను షేర్ ను వసూలు చేసింది.

5. సరిలేరు నీకెవ్వరూ(SARILERU NEE KEVVARU)…140 కోట్లను వసూలు చేసి ఐదో స్థానంలో ఉంది.

6. సైరా(SAIRA) …. 134 కోట్లను వసూలు చేసి ఆరో స్థానంలో ఉండగా,

7. వాల్తేర్ వీరయ్య (VALTER VEERAIAH)…132 కోట్లను వసూలు చేసి 7 స్థానంలో ఉంది.

8. రంగస్థలం (RANGASTALAM)…122 కోట్లను వసూలు చేసి 8 స్థానంలో ఉంది.

9. సర్కారి వారి పాట(SARKAARI VARI PATA)…115 కోట్లను వసూలు చేసి 9వ స్థానంలో ఉంది.

10 ఆది పురుష్(ADHI PURUSH) …109 కోట్లను వసూలు చేసి 10 వ స్థానంలో ఉంది.

11. సాహో (SAHO)…108  కోట్లను సాధించి 11 వ స్థానంలో

12. పుష్ప (PUSPA)…107 కోట్లను వసూలు చేసి 12 వ స్థానంలో

13. ఖైదీ నంబర్ 150(KHAIDI NUMBER 150)…104 కోట్లను వసూలు చేసి 13వ స్థానంలో నిలిచింది.

14. మహర్షి(MAHARSHI)…102 కోట్లను వసూలు చేసి 14 వ స్థానంలో ఉండగా

15. భరత్ అనే నేను(BHARAT ANE NENU)...102 కోట్లను వసూలు చేసి 15 వ స్థానంలో ఉంది.

16. కేజీఎఫ్ -2(KGF-2)…101 కోట్లను కలెక్ట్ చేసి డబ్బింగ్ సినిమాల చరిత్రలోనే రికార్డులను  నెల కొల్పింది.

ఇది కూడా చదవండి: హీరోల క్రష్ ఆ హీరోయిన్ల పైనే…