Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఊపిరితిత్తుల క్యాన్సర్ పట్ల జాగ్రత్తలు అత్యవసరం

స్పందన హాస్పిటల్- డాక్టర్ పావని.

ధర్మవరం ఆగస్టు 02 (నిజం చెపుతాం) ప్రతి ఒక్కరూ ఊపిరితిత్తుల క్యాన్సర్ పట్ల జాగ్రత్తలు అత్యవసరమని, నిర్లక్ష్యం చేయరాదని స్పందన హాస్పిటల్ డాక్టర్ పావని తెలిపారు.

ఈ సందర్భంగా బుధవారం అంతర్జాతీయ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా పలు విషయాలను వారు వెల్లడించారు. అనంతరం వారు మాట్లాడుతూ మరణానికి దారి తీసే వ్యాధులలో క్యాన్సర్ రెండవ స్థానంలో ఉందని తెలిపారు.

అంతేకాకుండా మన దేశంలో ఎక్కువగా కనిపించే అయిదు క్యాన్సర్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా ఒకటి అని వారు గుర్తు చేశారు. ఈ క్యాన్సర్ అతి ప్రమాదకరమని ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క కొన్ని సాధారణ లక్షణాలలో నిరంతరం తగ్గుట, ఆయాసము, కప్పములో రక్తము, చాతి నొప్పి, లోతైన శ్వాస తీసుకుంటున్నప్పుడు లేదా ఆకలి తగ్గడం బరువు తగ్గడం,ఈ వ్యాధికి లక్షణాలు అని తెలిపారు.

ఈ వ్యాధికి ప్రధాన కారణం పొగ తాగడం, సిగరెట్లు, చుట్టలు, బీడీలను తాగటమే కాకుండా, వీటి నుండి వెలువడే పొగను పక్క వాళ్ళు పీల్చినా కూడా ప్రమాదకరమైన అని తెలిపారు.

వ్యాధి యొక్క దశ, స్థానము, రోగి యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి, వైద్య చికిత్సలను అందించడం జరుగుతుందన్నారు. అందుకే ధూమపానం పొగాకు పదార్థాలకు వీలైనంతవరకు దూరంగా ఉన్నప్పుడే తగిన ఆరోగ్యం మీకు లభిస్తుందని, అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారము జీవన శైలి ను మార్పు చేసుకోవాలని తెలిపారు.

యోగా, వ్యాయామం తప్పనిసరి అని వారు తెలిపారు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, నిర్లక్ష్యాన్ని పూర్తిగా విడనాడాలని తెలిపారు.

క్రమం తప్పకుండా బాడీ చెకప్ ను చేయించుకోవాలని తెలిపారు. ఇలా చేస్తే ప్రారంభ దశలోనే క్యాన్సర్ను సులభంగా గుర్తించే అవకాశం ఉందని వారు తెలిపారు.