Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సినిమాల కోసం నాన్ వెజ్ తినకుండా ఉన్న హీరోలు వీరే…

టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు వస్తుంటాయి. కానీ సినిమాల కోసం డెడికేషన్ తో పనిచేసే హీరోలు చాలా తక్కువగానే ఉంటారు.. ఇలా తాము నటించిన సినిమాల కోసం నటించే క్యారెక్టర్ల కోసం సినిమా షూటింగ్ అయిపోయే వరకు చాలా క్రమశిక్షణతో, నాన్ వెజ్ తినకుండా పనిచేసిన హీరోలు వీరే…

నందమూరి తారక రామారావు (సీనియర్ ఎన్టీఆర్)..

సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో కోట్ల ప్రేక్షకుల మనసులు గెలిచిన వ్యక్తి సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు.

అయితే ఎన్టీఆర్ గారు ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందిన వారు.. అయితే సినిమాలు తీసేటప్పుడు చాలా క్రమశిక్షణతో డెడికేషన్ తో పనిచేస్తారు…

సీనియర్ ఎన్టీఆర్ గారు ఎన్నో డివోషనల్ మూవీస్ తీశారు. వీటికోసం సినిమాలు తీసే సమయంలో నాన్ వెజ్ తినకుండా ఉండేవారు…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…

ప్రస్తుతం విడుదలైన బ్రో సినిమా ఘన విజయం సాధించి 100 కోట్ల హబ్లో చేరింది..

అయితే ఈ సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాన్ వెజ్ తినకుండా ఉన్నారు.

అక్కినేని నాగార్జున…

2012వ సంవత్సరంలో సెప్టెంబర్ 6న విడుదలైన షిరిడి సాయి సినిమా ఘన విజయం సాధించింది.

అక్కినేని నాగార్జున షిరిడి సాయి సినిమా కోసం సినిమా షూటింగ్ అయిపోయేంతవరకు నాన్ వెజ్ తినకుండా ఉన్నారు…

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్….

2017 జూన్ 26న విడుదలైన దువ్వాడ జగన్నాథ్ సినిమా ఘన విజయం సాధించి 150 కోట్ల కలెక్షన్ ను చేసింది.

అల్లు అర్జున్ డీజే సినిమా కోసం నాన్ వెజ్ తినకుండా ఉన్నాడు..

అయితే డిజె సినిమాలో అల్లు అర్జున్ బ్రాహ్మణ క్యారెక్టర్ లో కనిపిస్తాడు.. బ్రాహ్మణుల మీద ఉన్న గౌరవంతో ఈ సినిమాలో నాన్ వెజ్ తినకుండా ఈ సినిమా షూటింగ్ అయిపోయే వరకు ఉన్నారు..

రిషబ్ శెట్టి (కాంతారా)..

2022 సెప్టెంబర్ 30న కాంతారా సినిమా విడుదలై ఘన విజయం సాధించి 400 కోట్ల 90 లక్షల కలెక్షన్ రాబట్టింది..

కాంతారావు సినిమా పూర్తిగా డివోషనల్ చిత్రం కావడంతో ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు..

కాంతారావు సినిమా కోసం హీరో రిషబ్ శెట్టి సినిమా షూటింగ్ అయిపోయేంతవరకు నాన్ వెజ్ తినకుండా ఉన్నారు..