Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పెద్ద హీరోలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న సినిమాలివే

ప్రతీ వారికి బ్యాడ్ టైమ్ ఉన్నట్లుగానే గుడ్ టైం ఉంటుంది. బ్యాడ్ టైం నడుస్తున్న సమయంలో సడెన్ గా హిట్ వచ్చి ఇండస్ట్రీలో నిలబడిన హీరోలెందరో ఉన్నారు. హీరోల నుండి ఒక బంఫర్ హిట్ వచ్చిన తరువాత ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ఆ తరువాత వచ్చిన సినిమాలు అంచనాలను అందుకోలేక చతికిలపడుతుంటాయి.

ఈ సమయంలో హీరోలకు వరుసగా ఫ్లాప్ లు, ఇంకా ఈ హీరో పని అయిపోయింది అనుకున్న సమయంలో ఆ హీరోలకు ఒక్కసారిగా ఇండస్ట్రీ హిట్ లను ఇచ్చి వారిని పరిశ్రమలో నిలబెట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిని కొన్నింటిని పరిశీలిద్దాం.

1. చిరంజీవి

1992లో చిరంజీవి నటించిన ఘరానామొగుడు సినిమా విడుదలై భారీ హిట్ ను సాధించింది. ఆ తరువాత బ్యాడ్ టైం ప్రారంభమైంది. మళ్ళీ చిరంజీవి బంఫర్ హిట్ రావడానికి 5 సంవత్సరాలు పట్టింది.

వరుసగా ఆపధ్భాంధవుడు, ఎస్ పి పరుశురాం, బిగ్ బాస్, రిక్షావోడు సినిమాలు ఫ్లాఫ్స్ గా మిగిలాయి. ముఠామేస్త్రి, అల్లుడా మజాకా సినిమాలు హిట్ అయినా చిరంజీవి రేంజ్ కు సరిపోలేదు.

మళ్లీ చిరంజీవికి పూర్వ వైభవం తీసుకుని వచ్చిన సినిమా హిట్లర్. ఈ సినిమా 1997లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చింది.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇక చిరు వెనక్కి తిరిగి చూసుకోలేదు.

2. బాలకృష్ణ

2001లో విడుదల అయిన నరసింహానాయుడు హిట్ తర్వాత బాలకృష్ణకు దాదాపు 9 సంవత్సరాలు హిట్ లేనేలేదు. మధ్యలో చెన్నకేశవరెడ్డి, లక్ష్మినరసింహాలు హిట్ అయినా అవి బాలకృష్ణ రేంజ్ హిట్లు కావు.

బలేవాడివి బాసూ, సీమసింహాం, పల్నాటి బ్రహ్మనాయుడు, విజయేంద్రవర్మ, అల్లరి పిడుగు, వీరభద్ర, మహారధి, ఒక్క మగాడు, పాండు రంగడు, మిత్రుడు.

ఇలా వరుసగా 10 సినిమాలు ఫ్లాఫ్ అయి బాలకృష్ణ స్టార్ స్టేటస్ ను తగ్గించాయి.

ఆ తర్వాత 2010లో రిలీజైన సింహాతో బాలకృష్ణ బ్యాడ్ ఫేజ్ ను వదలి పెట్టాడు. ఈ ఒక్క సినిమాతో బాలకృష్ణ తన బాక్సాఫీస్ రేంజ్ చూపించాడు.

3. నాగార్జున

అందరికంటే ఎక్కువ బ్యాడ్ ఫేజ్ ను చూసింది నాగార్జుననే. 1989లో శివ సెన్సేషనల్ హిట్ తరువాత వరుసగా ప్రేమయుద్ధం, నేటి సిద్దార్ధ,  ఇద్దరూ ఇద్దరే, చైతన్య, శాంతి క్రాంతి, జైత్రయాత్ర, అంతం సినిమాలు ఫ్లాఫ్ అయ్యాయి.

నిర్ణయం, కిల్లర్ సినిమాలు ఎబో యావరేజ్ గా నిలిచాయి. 3 సంవత్సరాల తరువాత నాగార్జునకు హిట్ పడింది

ప్రెసిడెంట్ గారి పెళ్లాం సినిమాతో. ఈ సినిమా 1992 రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

1997 అన్నమయ్య తర్వాత వచ్చిన రక్షకుడు, ఆటో డ్రైవర్, చంద్రలేఖ, రావోయి చందమామ అన్నీ ఫ్లాప్సే. ఆ తర్వాత వచ్చిన ఆవిడా మా ఆవిడే, సీతారామరాజు సినిమాలు హిట్ అయినా నాగార్జున రేంజ్ హిట్లు కాదు.

2000 విడుదలైన నువ్వు వస్తావని సినిమాతో నాగార్జున బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన నిన్నే ప్రేమిస్తా, అజాద్ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నా, ఆ తరువాత వచ్చిన ఎదురులేని మనిషి, బావనచ్చాడు, ఆకాశ వీధిలో, స్నేహామంటే ఇదేరా సినిమాలు వరుసగా ఫ్లాఫ్స్.

2002 లో వచ్చిన సంతోషం సినిమాతో నాగార్జునకు స్టార్ డమ్ వచ్చింది.

4. వెంకటేష్

టాప్ హీరోల్లో విజయాల సంఖ్య అధికంగా ఉన్నదంటే వెంకటేష్ కే. కాని వెంకటేష్ కూడా  ఒక సమయంలో బ్యాడ్ టైం లొోకి వెళ్లాడు. 2007లో వచ్చిన తులసి సినిమా హిట్ అయింది.

ఈ సమయంలో వెంకటేష్ నటించిన చింతకాయల రవి, ఈనాడు, నమో వెంకటేశ, నాగవల్లి, బాడీగార్డు సినిమాలన్నీ ఫ్లాఫ్ లుగా నిలిచాయి.

దాదాపు 6 సంవత్సరాల తరువాత 2013లో విడుదలైన సీతమ్మ వాకిట్లో చిరుమల్లె చెట్టు తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

5. పవన్ కళ్యాణ్

2001లో బ్లాక్ బస్టర్ హిట్ ఖుషి తరువాత దాదాపు 10 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ కు సరైన హిట్ లేదనే చెప్పాలి. ఖుషి మూవీ తరువాత వచ్చిన జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం, కొమరం పులి, తీన్మార్, పంజా సినిమాలన్నీ ప్లాఫ్ లే. మధ్యలో జల్సా సినిమా మాత్రమే హిట్.

ఆ తర్వాత 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ మళ్లీ పవన్ కు పూర్వ వైభవం తెచ్చి పెట్టింది.

6. మహేష్ బాబు

2006లో వచ్చిన పోకిరీ హిట్ తర్వాత మహేష్ నటించిన సైనికుడు, అతిథి, ఖలేజా సినిమాలు ప్లాప్స్.  2012 లో రిలైజైన  దూకుడు సినిమాతో మహేష్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

తర్వాత కొన్ని ప్లాఫ్ లు వచ్చిన ఇంత గ్యాప్ మాత్రం ఎన్నడూ రాలేదు.

7. ప్రభాస్

2005లో విడులైన ఛత్రపతి బ్లాక్ బస్టర్ తర్వాత 5 సంవత్సరాలు బ్యాడ్ టైం నడిచింది. ఆ తర్వాత విడుదలైన మున్నా, పౌర్ణమి, యోగి, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్ లు ప్లాప్ అయ్యాయి.

ఆ తర్వాత 2010లో రిలీజైన డార్లింగ్ విజయాల బాట పట్టించింది.

8. ఎన్టీఆర్

2003లో విడుదలై ఇండస్ట్రీ హిట్ సాధించిన సింహాద్రీ సినిమా తరువాత ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ సినిమాలన్నీ ఫ్లాప్ లుగా నిలిచాయి.

మధ్యలో వచ్చిన రాఖీ సినిమా ఒక్కటే హిట్, మళ్లీ ఎన్టీఆర్ కెరీర్ కు బ్రేక్ ఇచ్చిన సినిమా 2007లో విడులైన యమదొంగ. ఆ తర్వాత శక్తి, ఊసరవెళ్లి, దమ్ము, రామయ్యా వస్తావయ్యా, రభస వంటి ఫ్లాప్ లు వచ్చాయి.

2015లో రిలీజైన టెంపర్ సినిమా నుండి ఎన్టీఆర్ తన కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేదు.

9. రాంచరణ్

మగధీర లాంటి  ఇండస్ట్రీ హిట్ ను సాధించిన తర్వాత 2013 నుండి డౌన్ ఫాల్ ప్రారంభమయింది. గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ సినిమాలు ఫ్లాప్ అవ్వగా ధ్రువ సినిమా మోస్తార్ హిట్ అయింది.

2018లో విడుదలైన రంగస్థలం సినిమా వరకు రాంచరణ్ కు మంచి హిట్ లేదు.

10. అల్లు అర్జున్

దేశముదురు సినిమాతో స్టార్ స్టేటస్ ను అందుకున్న అల్లు అర్జున్ కు 5 సంవత్సరాల తరువాత గాని అంత హిట్ మూవీ రాలేదు.

పరుగు హిట్ అయినా అంత క్రేజ్ రాలేదు. ఆర్య 2, వరుడు, బద్రినాథ్ సినిమాలు ఫ్లాప్స్ తరువాత 2012 లో రిలైజైన జులాయి సినిమాతో బన్నీ నెక్ట్స్ లెవల్ కు వెళ్లిపోయాడు.

ఇది కూడా చదవండి….ఒకేసారి 18 సినిమాలు రిలీజ్ చేసిన స్టార్ హీరో ఈనె…