పీడీయాక్ట్ కేసు నమోదు చేసి జైలుకు తరలింపు

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గుండెపుడి గ్రామానికి చెందిన బానోతు వెంకన్న కు పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి సెంట్రల్ జైలు కు తరలించినట్లు తొర్రూర్ ఎక్సైజ్ సీఐ లావణ్య సంధ్య తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఈ సంవత్సరంలోనే అక్రమంగా బెల్లం రవాణా, నాటుసారా తయారీలలో సుమారు 5 కేసులు నమోదు కావడంతో జిల్లా కలెక్టర్ గౌతమ్ 116/2013/p& E/A3-3, Dtd:23.10.2020 ఆదేశాల మేరకు వెంకన్న పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి సెంట్రల్ జైల్ కు తరలించినట్లు తెలిపారు.