Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఒకేసారి 18 సినిమాలు రిలీజ్ చేసిన స్టార్ హీరో ఈనె…

సూపర్ స్టార్ కృష్ణ గారు 1943 మే 31న బుర్రిపాలెం అనే గ్రామంలో జన్మించారు. సూపర్ స్టార్ కృష్ణ గారు అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి..

సూపర్ స్టార్ కృష్ణ గారు తీసిన సినిమాలు ఈయన సెట్ చేసిన రికార్డులు ఎప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉంటాయి..

సూపర్ స్టార్ కృష్ణ గారి రికార్డ్స్ ఎప్పటికైనా ఎవరు బ్రేక్ చేయలేరు ఈ రికార్డ్స్ ఈయనకు మాత్రమే సొంతం..

తెలుగు ఇండస్ట్రీలో 70mm ,తెలుగు సినిమా స్కోప్, Dts సినిమా, కౌబాయ్ సినిమా, స్పైస్ ట్రిల్లెర్స్ వంటి చిత్రాలు సూపర్ స్టార్ కృష్ణ  మొట్టమొదట తీశారు.

సూపర్ స్టార్ కృష్ణ గారి సినీ ప్రవేశం..

సూపర్ స్టార్ కృష్ణ గారు సినిమాల మీద ఇష్టంతో 19 సంవత్సరాలకే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈయనకు సినిమాలోకి వచ్చాక ప్రముఖ డైరెక్టర్ ఆదుర్తి  సుబ్బారావు గారు కృష్ణ అని పేరు పెట్టారు..

1961లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన కులగోత్రాల చిత్రంతో సినీ ప్రవేశం చేశారు.

1964 డైరెక్టర్ సుబ్బారావు కొత్తగా తీస్తున్న తేనెమనసులు సినిమా కొరకు ఆడిషన్స్ నిర్వహించగా దానికి ఎంతోమంది వారి ఫోటోలు పంపించి హాజరైన చివరకు ఇద్దరు నటిల్లో ఒకరిగా కృష్ణగారి ఎంపికయ్యారు.

ఆ తర్వాత స్క్రీన్ టెస్ట్ కొరకు మద్రాస్ రమ్మని పిలిచారు.. ఇలా సూపర్ స్టార్ కృష్ణ గారు సినీ జీవితాన్ని మొదలుపెట్టారు. ఈయన ఏ పాత్ర ఇచ్చిన వదికి పోగల నటుడిగా పేరుపొన్నారు.

1965 లో వచ్చిన తేనె మనసులు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత వచ్చిన గూడచారి 116 సినిమా కృష్ణ గారికి సినీ జీవితానికి గట్టి పునాది వేసింది.

  • మొదటి 70mm చిత్రం సింహాసనం
  • మొదటి తెలుగు సినిమా స్కోప్ అల్లూరి సీతారామరాజు.
  • మొదటి డిటిఎస్ చిత్రం తెలుగువీరలేవరా.
  • మొదటి కౌబాయ్ సినిమా మోసగాళ్లకే మోస గాడు

వంటి సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి మొదట పరిచయం చేసింది సూపర్ స్టార్ కృష్ణ…

ఎవరు సాధించలేని సూపర్ స్టార్ కృష్ణ గారి రికార్డ్స్ ఇవే…

సూపర్ స్టార్ కృష్ణ గారు అప్పట్లోనే స్పై త్రిల్లెర్స్ వంటి సినిమాలు తీసి రికార్డులు సృష్టించారు.. ఈయన తీసిన సినిమాలు తెలుగు జోనర్ లోనే ఇప్పటివరకు ఎవరు తీయలేకపోయారు. బాక్సాఫీస్ రికార్డులు ఈయన సొంతం.

సూపర్ స్టార్ కృష్ణ గారు ఒకేసారి 16 సినిమాలకు డైరెక్షన్ చేశారు.

1964 నుండి 1994 మధ్యకాలంలో సహజంగా సంవత్సరానికి 10 సినిమాలు రిలీజ్ చేసేవారు..

ఒకసారి అయితే 1974లో ఒకేసారి 18 సినిమాలో రిలీజ్ చేసి ఎవరు బ్రేక్ చేయలేని రికార్డ్ సాధించారు..

1970లో సూపర్ స్టార్ కృష్ణ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా ఉన్నారు. ఈయన రోజుకి మూడు షిఫ్ట్ లలో పనిచేసేవారు.

1965 నుండి 2000 వరకు దాదాపు సంవత్సరానికి సూపర్ స్టార్ కృష్ణ గారిది ఒక్క సినిమా అయినా రిలీజ్ చేసేవారు.

ఇలా 37 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం ఒక సినిమా లెక్కన చూసుకుంటే 37 సినిమాలు ఆగకుండా వరుసగా విడుదలైన చిత్రాలు సూపర్ స్టార్ కృష్ణ గారివే.

ఓకే హీరోయిన్ తో ఎక్కువ సినిమాలు తీసిన వ్యక్తిగా ఈయనకు రికార్డ్స్ ఉన్నాయి.

విజయనిర్మల గారితో 48 సినిమాలు, జయప్రద 47 సినిమాలలో నటించారు..

మొదట డబుల్ రోల్ చేసింది సూపర్ స్టార్..

సూపర్ స్టార్ కృష్ణ 25 సినిమాలలో డబుల్ రోల్ చేశారు. ఏడు సినిమాలలో త్రిపుల్ రోల్ కూడా చేశారు.

ఫస్ట్ పాన్ ఇండియా స్టార్..

ఈ మధ్యకాలంలో ఫ్యాన్ ఇండియా సినిమాలు వచ్చాయి కానీ. మొదట ప్లాన్ ఇండియా సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారిదే..

1971 లో విడుదలైన మోసగాళ్లకే మోసగాడు సినిమా 56 దేశాలలో రిలీజ్ అయింది. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ సూపర్ స్టార్ కృష్ణ గారు పేరు మీద ఒక స్టాంపులు కూడా రిలీజ్ చేసింది. ఈయన తీసిన సినిమాలు ఫెయిల్ అయిన నిర్మాతలకు డబ్బులు వెనక్కి తిరిగిచ్చేవారు. నిర్మాతలకు సూపర్ స్టార్ అంటే ఒక నమ్మకం.

కథల ఎంపిక..

సూపర్ స్టార్ కృష్ణ గారు మంచి కథలు ఎంపిక చేస్తారు.. సూపర్ స్టార్ కృష్ణ గారు అన్ని రకాల సినిమాలు తీశారు.

మైథాలజీ ,డ్రామా, వెస్ట్రన్, ఫాంటసీ ,స్పై, థ్రిల్లర్, యాక్షన్, హిస్టారికల్ పంటి సినిమాలు తీసేవారు.

సూపర్ స్టార్ రాజకీయ ప్రవేశం...

యాక్టర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మాత్రమే కాదు ఈయన ఒక రాజకీయ నాయకుడు కూడా.

1964లో రాజీవ్ గాంధీ ఆహ్వాన మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

1989లో ఏలూరు నుండి ఎంపీగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు.

సూపర్ స్టార్ కి దక్కిన బిరుదులు ఇవే..

1976లో సెంట్రల్ లేబరర్ డిపార్ట్మెంట్ వారు ఈయనకు నటశేఖర అనే బిరుదు ఇచ్చారు..

1997లో ఫిలింఫేర్ సౌత్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు.

2000లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డును కూడా అందుకున్నారు..

2008లో ఆంధ్ర యూనివర్సిటీ వారు సూపర్ స్టార్ కృష్ణ కి గౌరవ డాక్టరేట్ సత్కరించారు.

2009లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎన్నో అవార్డులు ఎన్నో బిరుదులు, ఎన్నో బాక్సాఫీస్ రికార్డ్స్ ,ఈయనకే సొంతం.