Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బురుజు మైసమ్మ భూమిని కాపాడండి

*అవురుపల్లిలో బురుజు మైసమ్మ పక్కన ఉన్న భూమిని కాపాడండి

ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు వినతిపత్రం అందజేసిన మహిళలు!!

మాడ్గుల జూలై 31 ( నిజం చెపుతాం):

మండలంలోని అవురుపల్లి గ్రామంలో నడి బొడ్డున ఉన్న బురుజు మైసమ్మ దేవాలయం పక్కన ఉన్న భూమిని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఉన్నతాధికారులను ఉపయోగించుకొని అక్రమంగా పట్టా చేయించుకుని మా ఇళ్ళను కూలగొట్టేందుకు లోలోపల ప్రయత్నం చేస్తున్నందున మాకు తగు న్యాయం చేయాలని మహిళలు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. సోమవారం అవురుపల్లి గ్రామంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కాగా గ్రామంలో పర్యటిస్తున్న సందర్భంలో మహిళలు ఎమ్మెల్యే కు అడ్డు తగిలి మీ ధరణి పుణ్యాన పొజిషన్లో లేని భూమిని ఒకరికి పట్టా చేశారని వారు రేపు మమ్మల్ని ఏం చేస్తాడో అని భయంగా ఉందని మాకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేని కోరగా ఎంతటి వారైనా మీకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే మహిళలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పంబాల రామచంద్రయ్య, బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బండారి యాదయ్య, పార్టీ సీనియర్ నాయకుడు వి వెంకటేశ్వరరావు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.