Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పెట్రోల్ తో నీళ్ళు కలిపి పోస్తున్నారు..?

పెట్రోల్ బంక్ లో పెట్రోల్ లో నీళ్ళు….

పెట్రోల్ బంక్ లో పెట్రోల్ తో పాటు నీళ్ళు కలిపి అమ్ముతున్న పెట్రోల్ బంక్ యాజమాన్యం

నిరసన వ్యక్తం చేసిన వినియోగదారులు

విచారణ చేపట్టేంత వరకు బంకు మూసివేత

మరిపెడ జులై 31 నిజం న్యూస్

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని శ్రీరామ ఫిల్లింగ్ స్టేషన్ ఇండియన్ పెట్రోల్ బంక్ లో నీళ్లు వస్తున్నాయని పలువురు వాహన వినియోగ దారులు ఆరోపించారు.

ఈ మేరకు సోమవారం నీళ్లు కలిసిన పెట్రోలు బాటిళ్లతో వినియోగదారుల తరుపున బి యస్ పీ జిల్లా నాయకులు ఐనాల పరశురాములు మాట్లాడుతూ పెట్రోల్ బంకుల్లో పక్కాగా కల్తీ జరుగు

తుందన్నారు. మండలంలోని అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన జినక ప్రకాష్ అనే వ్యక్తి తన బైక్లో ఇదే బంకులో 5 లీటర్ల పెట్రోల్ పోయించుకంటే సుమారు లీటర్ నీళ్లు వచ్చాయన్నారు.

కొంతకాలంగా నీళ్లు, వైట్ కిరోసిన కలిపిన పెట్రోలు వస్తుందని బంకు ఎదుట వినియోగదారులు నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా బాధిత

విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇదే బంకుపై గతంలో అనేకఆరోపణలు వచ్చినట్లు తెలిపారు. లక్షలు పెట్టి బైక్ కొనుగోలు చేసుకుంటే కల్తీపెట్రోల్ మొరాయి

స్తున్నాయని ఆయన వాపోయారు. అయినప్పటికి తరుపున ఐనాల పరశురాములు మాట్లాడుతూ పెట్రోల్ బంకుల్లో పక్కాగా కల్తీ జరుగుతుందన్నారు. మండలంలోని అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన జినక ప్రకాష్ అనే వ్యక్తి తన బైక్ లో ఇదే బంకులో 5 లీటర్ల పెట్రోల్ పోయించుకంటే సుమారు లీటర్ నీళ్లు వచ్చాయన్నారు.

కొంతకాలంగా నీళ్లు, వైట్ కిరోసిన కలిపి వినియోగదారులకు అమ్ముతున్నపటికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోక పోగా కనీసం వారి నుంచి స్పందన కరువైందన్నారు.

ఇప్పటికైన అధికారులు స్పందించి కల్తీ పెట్రోల్ బంకులపై చర్యలు తీసుకోని, నాణ్యమైన పెట్రోల్ వినియోగదారులకు అందేల చూడాలని ఆయన కోరారు.

ఈ నిరసన కార్యక్రమంలో బిఎస్పీ నాయకులు అభినాయక్, జినక కృష్ణమూర్తి, వాహన వినియోగదారులు ఉపేందర్, జినక బాబు, జిన్నా సందీప్, దీలీప్. జిన్నా సంపత్, దామనాయక్ పాల్గొన్నారు.

-పెట్రోల్ బంక్ మూసివేత

అనంతరం వినియోదారుల ఇచ్చిన ఫిర్యాదు మెరకు తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ భూక్య నందనాయక్ వచ్చి జిల్లా సేల్స్ అధికారులు వచ్చి

విచారణ చేసేంతవరకు బంకును మూసివేయాలని నిర్వాహకులను హెచ్చరించారు.