కరోనాపై అవగాహన సదస్సు

టేకులపల్లిలో ఈ రోజు ఉదయం కుటుంబ మరియు ఆరోగ్య సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి గారి వీడియో సదస్సు లో కోవిడ్ 19 వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశించిన సూచనల మేరకు మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి గారి ఆదేశాలు మేరకు మండలం లోని అన్ని గ్రామాల్లో ఉన్న స్వయం సహాయక సంఘాల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు వీడియో సదస్సు అనంతరం టేకులపల్లి మండలం లోని కోయగూడెం గ్రామంలో కోవిడ్19 నివారణ చర్యల పై అవగాహన కార్యక్రమం నిర్వహించుట జరిగింది..దీనిలో భాగంగా చేతులు శుభ్రంగా కడుక్కోవడం,
మాస్కులు ధరించే అవగాహన
కార్యక్రమం,
సామాజిక దూరం, భౌతిక దూరం గురించి అవగాహన కల్పించుట జరిగింది..
ఈ కార్యక్రమం మండలంలోని అన్ని గ్రామాల్లో రాబోయే సంక్రాంతి పండుగ వరకు జాగ్రత్తలు తీసుకోవాలి అని ఈ రోజుల్లో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సిసి లకు సూచనలు చేశాము
ఈ కార్యక్రమంలో వివో ప్రతినిధులు
జయ ఇతరులు
పాఠశాల ఉపాధ్యాయులు, సిసి లు సునీల్, చిరంజీవి, నాగేశ్వరరావు, తదితరులు హాజరయ్యారు.