Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఇండస్ట్రీ హిట్లను వదులుకున్న హీరోలు వీరే..లేకుంటేనా

మొదట తన దగ్గరకు వచ్చిన సినిమాలను ఏదో కారణంతో వదులుకున్న హీరోలు అవి వేరే హీరోల చేతిలో పడి ఇండస్ట్రీ హిట్లుగా మారిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.

సీనియర్ ఎన్టీఆర్ రామారావు తన దగ్గరకు వచ్చిన దేవదాసు సినిమాను తనకు సూటవదని వదులుకున్నారు. ఆ తర్వాత ఆ సినిమా అక్కినేని నాగేశ్వరరావు వద్దకు పోవడం అది ఇండస్ట్రీ హిట్ గా నిలవడం తెలిసిందే.

అక్కినేని నాగేశ్వరరావు తన వద్దకు వచ్చిన పాతాళ బైరవి సినిమాను తన వర్కవుట్ కాదని వదులుకోవడంతో విజయా వారు దానిని ఎన్టీఆర్ వద్దకు తీసుకుని పోవడం, ఆయన ఒకే చేయడంతో 1951లో విడుదల చేసి  ఇండస్ట్రీ హిట్ ను కొట్టారు.

శోభన్ తన వద్దకు వచ్చిన అడవి రాముడు సినిమాను తనకు ఈ కథ సరిపోదని, దానిని ఎన్టీఆర్ వద్దకు పొమ్మని నిర్మాతలకు చెప్పగా వారు వెళ్లడం, అది ఇండస్ట్రీ హిట్ గా నిలవడం తెలిసిందే.

సూపర్ స్టార్ కృష్ణ రెండు ఇండస్ట్రీ హిట్ సినిమాలను వదులుకున్నారు. అవి 1. ఖైదీ 2. పసివాడి ప్రాణం. ఈ రెండు సినిమాలు చిరంజీవి వద్దకు వెళ్లడం, అవి ఇండస్ట్రీలోనే ఎంత పెద్ద హిట్లుగా నిలిచాయో తెలిసిందే.

రాజేంద్ర పసాద్ వద్దకు వచ్చిన చంటి సినిమా అనుకోకుండా వెంకటేష్ దగ్గరకు చేరడం అది పెద్ద హిట్ గా నిలిచింది. తమిళ సినిమా చిన తంబి సినిమా హక్కులను నిర్మాత కెెెఎస్ రామారావు తీసుకుని రాజేంద్ర ప్రసాద్ హీరోగా చేద్దామని అనుకోవడం దానికి సురేష్ బాబు తన తమ్ముడితో తీయమని చెప్పడంతో రాజేంద్ర ప్రసాద్ కు ఇండస్ట్రీ హిట్ మిస్సయిందనే చెప్పాలి.

పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చిన కథలు ఏదో కారణంతో వేరే వాళ్ల వద్దకు పోవడం అవి ఇండస్ట్రీ హిట్ గా నిలవడం జరిగింది. అందులో మొదటిది తరుణ్ హీరోగా చేసి ఇండస్ట్రీ హిట్ ను సాధించిన నువ్వే కావాలి సినిమా. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ హీరోగా అమిషా పటేల్ హీరోయిన్ గా చెప్పాలని ఉంది టైటిల్ తో తీస్తుండగా రామోజీరావు  ఈ సినిమా హక్కులు తమ వంటూ రావడంతో సినిమా ఆగి పోయింది. ఆ తర్వాత రామోజీరావు పవన్ తోనే తీయడానికి ప్రయత్నించగా పవన్ ఒప్పుకోకపోవడంతో ఈ కథ తరుణ్ వద్దకు వెళ్లింది. అలా తరుణ్ ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను సాధించాడు.

పూరిజగన్నాద్ చెప్పిన పోకిరి కథను పవన్ కళ్యాణ్ తిరస్కరించడం, అది మహేష్ బాబు వద్దకు పోవడంతో అది రిలీజై ఇండస్ట్రీలోనే పెద్ద హిట్ గా నిలిచింది.

నాగార్జున కూడా ఒక  ఇండస్ట్రీ హిట్ ను వదులుకున్నారు. అదే కలిసుందాం రా సినిమా. ఉదయశంకర్ ఈ సినిమాను నాగార్జున వద్దకు తీసుకుని పోవడంతో ఇప్పటికే ఈ జోనర్ లో సినిమాలు తీసానని వద్దని తిరస్కరించడంతో  ఈ కథ వెంకీ వద్దకు వెళ్లి సిల్వర్ జూబ్లీ పంక్షన్స్ తో ఇండస్ట్రీ హిట్ ను సాధించారు.

సమరసింహారెడ్డి సినిమాను డైరెక్టర్ బి. గోపాల్ మొదట వెంకటేష్ వద్ద తీసుకుని పోగా, వెంకటేష్ తిరస్కరించడంతో ఈ కథ బాలకృష్ణ వద్దకు వెళ్లింది. ఆ తర్వాత బాలయ్య ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ ను సాధించాడు.

ఇది కూడా చదవండి…సెప్టెంబర్ లో రాబోయే పాన్ ఇండియా సినిమాలు ఇవే…