*తాడ్వాయి మండల కమిటీ ఎన్నిక *

నేతకాని కులస్తులు ఆర్థిక, సామాజిక, రాజకీయ మొదలగు అన్ని రంగాలలో ఎదగాలని, చైతన్యం వస్తేనే హక్కులు సాధించుకోవడం సాధ్యపడుతుందని, నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షులు జనగాం నరేష్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో తాడ్వాయి నేతకాని సంఘం, నేతకాని యువజన, మహిళా సంఘం లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మానవ హక్కులను రక్షించుకోవడానికి ఎందరో వీరులు నిరంతరం పోరాడుతూనే ఉన్నారని నేతకాని కులంలో సామాజిక స్పృహ చైతన్యం అవగాహన రావాలన్నారు. ప్రతి ఒక్కరూ బాగా చదివి విద్యావంతులు కావాలని ఆకాంక్షించారు. మన హక్కులను సాధించుకోవడానికి నేతకాని కులస్తులు కలిసికట్టుగా హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలని ఆయన కోరారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కల్పించిన రాజకీయ రిజర్వేషన్లను ఉపయోగించుకొని నేతకాని కులస్తులు ఎదగాలని ఆయన అన్నారు. నేతకాని యువతకు రాజకీయ పార్టీలు ప్రాధాన్యత కల్పించాలని ఆయన కోరారు. రాజకీయ అవగాహన లేకపోవడంతో న్యాతకాని కులస్థులు ముందు కు వెళ్లలేక పోతున్నారని, విద్యా పరంగా చాలా మంది యువత వెనుకబడి ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా హక్కులను సాధించుకోవడానికి ఉద్యమాలకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మండల కమిటీ ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా చెన్నూరు సీతారాములు (రంగాపూర్), ఉపాధ్యక్షులుగా భాడిష నారాయణ( రంగాపూర్), ప్రధాన కార్యదర్శిగా గాందెర్ల కాంతారావు (నర్సాపూర్) కార్యదర్శి దుర్గం విశ్వనాథన్ (తాడ్వాయి), కోశాధికారి చెన్నూరు రవి (లింగాల) ప్రచార కార్యదర్శి సునారికాని ఆనందరావు (నర్సాపూర్), సాంస్కృతిక కార్యదర్శి సల్లూరి సత్యం (రంగాపూర్) ముఖ్య సలహాదారులు, భాడిష వెంకన్న, దుర్గం రవి, గౌరవ అధ్యక్షులు సల్లూరి లక్ష్మణ్. మండల కమిటీ తోపాటు యూత్ కమిటీ మహిళా కమిటీలను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం గోగు మల్లయ్య, రాష్ట్ర నాయకులు కావేరి అర్జున్, జిల్లా నాయకులు దికొండ నర్సింగరావు, ఆకుదారి గంగాధర్, జి డి లక్ష్మణ్ స్వామి, నేతకాని సంఘం మహిళలు, యువకులు, మేధావులు, విద్యావంతులు, తదితరులు పాల్గొన్నారు.