మంత్రి వచ్చారు… పోయారు.. ఎదురుచూసిన ప్రజలకు నిరాశే మిగిల్చారు..
జిపి పల్లి పునరవాస కేంద్రాన్ని సందర్శించిన.. రవాణా శాఖ మంత్రి.. పువ్వాడ అజయ్ కుమార్
చర్ల జూలై 29 (నిజం చెపుతాం) ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్నారు మహాకవి శ్రీశ్రీ.
బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రరవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శనివారం మండలంలోని ముంపు ప్రాంతాలను సందర్శించి ఏదో చేస్తారని రెండు గంటలసేపు కళ్ళు లొట్టలుపోయేలా ఎదురు చూసిన ప్రజలకు నిరాశ మిగిల్చారు.
మంత్రి హెలిక్యాప్టర్ పై వచ్చి లింగాపురంపాడు హెలిప్యాడ్ గ్రౌండ్ లో దిగారు. ఆయనకు భద్రాచలం అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు. మండల అధికారులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు స్వాగతం పలికారు
అక్కడనుండి వాహనాల్లో బయలుదేరి జిపి పల్లి పునరవాస కేంద్రాన్ని సందర్శించారు పునరవాస కేంద్రంలో వరద బాధితులతో మాట్లాడారు వరద బాధితులకు ఈరోజు సాయంత్రం గుడ్డుతో భోజనం పెట్టండి అంటూ అధికారులను ఆదేశించారు.
మంత్రి వచ్చారు. పోయారు ఎందుకు వచ్చినట్లు పనులు మానుకొని ప్రతి ఏటాగోదావరి వరదలకు పడుతున్న బాధలను మంత్రి దృష్టికి తెచ్చి శాశ్వత పరిష్కారం చేయాలని గోదావరి ముంపు ప్రాంతాల ప్రజలు ఇన్నాళ్లకు మంత్రి వచ్చారని ఆయనకు వారి బాధలను వెల్ల బుచ్చి ఆయన దృష్టికి తేవాలనే ఎదురు చూసిన ప్రజలకు తీరా నిరాశే మిగిల్చారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి
కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి ఏ డి ఏ సుధాకర్ రావు తాసిల్దార్ బి భరణి బాబు సిఐబి అశోక్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోయం రాజారావు రైతుబంధు కోఆర్డినేటర్ కొసరాజు కుమార్ రాజా మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు.
ప్రచార కార్యదర్శి కొట్టేరు శ్రీనివాసరెడ్డి ఉపాధ్యక్షులు పోలిన లంక రాజు రైట్ క్లబ్ చైర్మన్ కొత్తపల్లి రామాంజనేయులు. పి. బ్రహ్మానంద రెడ్డి సర్పంచులు పోడియం మురళి కోరం నాగేంద్ర మురళి ఎస్.డి అజీజ్ కాకి అనిల్. గోసుల మురళి. కాపుల నాగరాజు. తోట మల్ల వరప్రసాద్ తోటమల్ల రవి. బిఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు