Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన 16 సినిమాలివే

సీనియర్ ఎన్టీఆర్ మంచి నటుడే కాదు మంచి దర్శకుడు కూడా. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు  ఇండస్ట్రీ హిట్లు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ 16 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

  1. గులేభకావళి కథ ….ఎన్టీఆర్ దర్శకత్వం చేపట్టిన తొలి సినిమా. జానపద కథను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడం చూసి సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా 1962 లో విడుదల అయింది.

శ్రీకృష్ణ పాండవీయం

1966లో ఎన్టీఆర్ దర్శకత్వం లో వచ్చిన ఈ మైథలాజికల్ సినిమా విశేషంగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రాజనాల, కాంతరావు, వరలక్ష్మిలు నటించారు.

వరకట్నం

1969లో విడుదలైన ఈ సినిమా చక్కటి సోషల్ మేసేజ్ ను ఇచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు కృష్ణకుమారి, సావిత్రిలు నటించారు.

సీతారామకళ్యాణం

1969లో విడుదల అయింది. దీనిలో రావణాసురుడి పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు.

తల్లా-పెళ్లామా

1970లో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన చంద్రకళ నటించగా టైటిల్ కు తగ్గట్టుగా చక్కటి మెసేజ్ ను అందించారు.

తాతమ్మ కల

1974లొో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు బాలకృష్ణ, హరికృష్ణలు నటించారు. భానుమతి చక్కటి పాత్రలో నటించింది.

చాణక్య చంద్రగుప్త

1977లో ఈ సినిమా విడుదల అయింది. చాణక్యుడిగా ఎఎన్ ఆర్, చంద్రగుప్తుడిగా ఎన్టీఆర్ నటించారు.

దాన వీర శూర కర్ణ

1977లో విడుదల అయిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కర్ణుడిగా, ధుర్యోధనుడిగా, కృష్ణుడిగా ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించి మెప్పించారు.

శ్రీరామ పట్టాభిషేకం

1978లో వచ్చిన  ఈ సినిమాలో ఎన్టీఆర్ రాముడిగా, రావణాసురుడుగా నటించారు. ఈ సినిమాలో రావాణాసురుడు పాత్రను మలిచిన తీరు అధ్భుతమనే చెప్పాలి.

అక్భర్ సలీం అనార్కలి

1979లో వచ్చిన హిస్టారికల్ మూవీ ఇది. ఇందులో సలీంగా బాలకృష్ణ నటించాడు.

శ్రీ మద్విరాట్ పర్వం

1979లో మహాభారతంలోని విరాట పర్వం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.  అర్ణునుడిగా, ధుర్యోధనుడిగా, కృష్ణుడిగా, కీచకుడిగా, బృహన్నలుగా ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించారు.

శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం..

1979లో విడుదలైన ఈ సినిమాలో ఎన్టీఆర్ వేంకటేశ్వర స్వామిగా, జయసుధ, జయప్రదలు లక్ష్మి దేవి, పద్మావతి దేవతలుగా నటించారు.

చండశాసనుడు..

1983లో ఈ సినిమాను తెరకెక్కించారు ఎన్టీఆర్. ద్విపాత్రాభినయంతో ఈ సినిమాను తీసారు. రాధ ఇందులో హీరోయిన్ గా నటించారు.

శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర

1984లో వచ్చిన ఈ సినిమాతో ఎన్టీఆర్ పెను సంచలనం సృష్టించారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

బ్రహ్మర్షి విశ్వామిత్ర...

1991 లో ఈ సినిమా విడుదల అయింది. ఇందులో బాలకృష్ణ హరిశ్చందుడు, దుశ్యంతుడిగా నటించగా, ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటించారు.

సామ్రాట్ అశోక్..

1992లో ఈ సినిమా విడుదల అయింది. ఇదే ఎన్టీఆర్ ధర్శకత్వంలో వచ్చిన ఛివరి సినిమా. ఈ సినిమాలో ఎన్టీఆర్ అశోకుడిగా, చాణక్యుడిగా నటించారు.