Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఒకే నెలలో 4 సినిమాలు రిలీజ్…4 బంఫర్ హిట్లే..ఇది ఇప్పటికీ రికార్డే

1994 ఏప్రిల్ నెలలో తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లన్నీ ప్రేక్షకులతో కళకళలాడాయి.  ఒకే నెలలో విడుదలైన నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ లుగా నిలవడం తెలుగు సినీ చరిత్రలో ఎప్పుడూ లేదనే చెప్పాలి. అవి మామూలు హిట్లు కాదు. బంఫర్ హిట్లు.

1. అన్న(ANNA)

1994 ఏప్రిల్ 7వ తేదీన రాజశేఖర్, గౌతమి, రోజా హీరోహీరోయిన్ లుగా విడుదలైన చిత్రం అన్న. ఈ చిత్రానికి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు.

ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతంలో అందించిన పాటలు ప్రజలను ఆకట్టుకోవడంతో పాటు సినిమా బంఫర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం 5 కోట్లను వసూలు చేసింది.

2. భైరవద్వీపం(BHAIRAVADWEEPAM)

1994 ఏప్రిల్ 14న బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రోజా హీరోయిన్ గా నటించిన చిత్రం భైరవద్వీపం. వీరి కాంబినేషన్ లో గతంలో ఆదిత్య 369 చిత్రం రావడంతోొ ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.

జానపద చిత్రంగా వచ్చిన బైరవద్వీపం బంఫర్ హిట్ అయింది. ఈ సినిమాకు మాధవపెద్ది సురేష్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్లే. ఈ చిత్రం 7 కోట్ల 75 లక్షలను వసూలు చేసింది.

3. హాలో బ్రదర్(HELLO BROTHER)

1994 ఏప్రిల్ 20వ తేదీన నాగార్జున హీరోగా ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన హలో బ్రదర్ సినిమా రిలీజైంది. ఈ సినిమాలో నాగార్జున డ్యూయల్ రోల్ లో నటించగా, హీరోయిన్ లుగా సౌందర్య, రమకృష్ణలు నటించారు.

రాజ్ కోటి సంగీత సారధ్యంలో వచ్చిన ఈ సినిమాలో పాటలు అప్పటి కుర్రకారును ఒక ఊపు ఊపాయి.

బ్రహ్మనందం, కోట శ్రీనివాసరావు. మల్లి ఖార్జున రావుల కామెడీతో ఈ  సినిమా బంఫర్ హిట్ అయింది. ఈ చిత్రం 8 కోట్లను వసూలు చేసింది.

4. యమలీల(YAMALEELA)

1994 ఏప్రిల్ 28న అలీ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో సోషియో ఫాంటసీ చిత్రంగా యమలీల సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు సంగీతం ఎస్వీ కృష్ణారెడ్డి అందించారు.

ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్లే. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ జుంబారే జూజుంరే అనే పాట చేసిన డాన్స్ అప్పట్లో సంచలనం.

యముడిగా కైకాల సత్యనారాయణ, చిత్ర గుప్తుడిగా బ్రహ్మనందం చేసిన కామెడీ సినిమా విజయానికి ప్లస్ పాయింట్ గా నిలిచాయి. ఈ చిత్రం 6 కోట్ల 25 లక్షలను వసూలు చేసింది.

ఈ నాలుగు చిత్రాలలో కలెక్షన్ల పరంగా హాలో బ్రదర్ ముందుండగా, డైరెక్ట్  100 రోజుల కేంద్రాల పరంగా బైరవధ్వీపం ముందుంది. ఇది డైరెక్ట్ గా 28 కేంద్రాలలో 100 రోజులు ఆడగా, హలో బ్రదర్ 22 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.

తెలుగు సినీ చరిత్రలో ఒకే నెలలో 4 సినిమాలు విడుదలై బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలబడం ఇంత వరకు జరగలేదనే చెప్పాలి.