టీఆర్ఎస్ పార్టీలో చేరిన పినపాక ఎంపీటీసీ సత్యం

మండల కేంద్రమైన పినపాక ఎంపీటీసీ చింతపండు సత్యం మంగళవారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణా ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పినపాక నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనులను చూసి తెలంగాణా ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గారి మీద నమ్మకంతో టీఆర్‌ఎస్ పార్టీలో చేరినట్లు ఎంపీటీసీ సత్యం తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ఎంపీపీ గుమ్మడి గాంధీ, వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షుడు రవివర్మ, వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, ఆత్మ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు దొడ్డా శ్రీనివాసరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు బొలిశెట్టి నర్సింహారావు, దాట్ల వాసుబాబు, ఉడుముల లక్ష్మిరెడ్డి, సోంపల్లి తిరపతి, పుల్లెపు శ్రీనివాసరావు, పొనుగోటి కామేశ్వరరావు, పోలిశెట్టి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.