Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

భలే భలే టమాటా -బాతు టమాటా

తూర్పుగోదావరి జిల్లా (మెళ్ళూరు )

జూలై 28.. నిజం చెపుతాం న్యూస్..

రాను రాను టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

టమాటా ఇప్పుడు ట్రెండ్ సృష్టిస్తుంది. రేటులోనే కాకుండా రూటులో కూడా టమాటా ఆకృతిలో అనేక విచిత్రాలు చోటు చేసుకుంటాయి.

అలాంటి సంఘటన చోడవరం కూరగాయలు దుకాణంలో చోటు చేసుకుంది. అపురూపమై,అధిక ధర పలుకుతున్న టమాటాలలో ఒక టమోటా బాతు ఆకృతిలో ఉండి చూపరులను ఆకర్శించింది.

వివరాలలోకి వస్తే రామచంద్రపురం మోడరన్ జూనియర్ కాలేజీ అకడమిక్ అడ్వైజర్ మరియు ఆంగ్ల అధ్యాపకులు,నిజం పత్రిక తూర్పుగోదావరి జిల్లా రిపోర్టర్ అయిన చల్లా శ్రీనివాస్ చోడవరం జంక్షన్ వద్ద శుక్రవారం సాయంత్రం కూరగాయలు కొనుగోలు చేసి ఇంటికి వచ్చిన

తర్వాత చూస్తే టమాటా లందు ఒక టమాటా బాతు ఆకారంలో ఉండిఔరా! అనిపించింది.

ఈ విషయమై మోడరన్ జూనియర్ కాలేజీ సైన్స్ అధ్యాపకులు శివఅమ్మిరాజును వివరాలు అడుగగా కూరగాయలలో జన్యుపరమైన మార్పుల వలన ఈ విధంగా కూరగాయలు పలు ఆకృతులలో కనిపిస్తాయని వివరించారు.

ఏది ఏమైనా టమాటా లందు బాతు టమాటా వేరు అన్నట్లుగా ఈ టమాటా అందరినీ ఆకర్శిస్తుంది.