Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బీహార్, ఉత్తరప్రదేశ్ మగ కూలీలతో జోరుగా నాట్లు

-ఆడ కూలీలకు దీటుగా ….మగ కూలీలు సైతం.

-ఎకరానికి కేవలం 5000 రూపాయలతో పూర్తిగా నాట్లు వేస్తున్న కూలీలు

-హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక రైతులు.

ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేయడంతో.. మా కళ్ళలో ఆనందం అంటున్న కూలీలు.

తుంగతుర్తి జులై 29 నిజం చెబుతాం న్యూస్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్ద పీఠం వేయడంతో నేడు గ్రామాలు కాలేశ్వరం జలాలతో పూర్తిగా చెరువులు కుంటలు నిండిపోవడంతో, గ్రామీణ ప్రాంత రైతులు వరి పంటను ఎంపిక చేసుకొని ఉత్పత్తి సాధిస్తున్నారు.

దీనిలో భాగంగా ముఖ్యంగా వరి నాట్లు వేసే క్రమంలో తెలంగాణ రైతు కూలీలు, పత్తి మిరప చేనుల్లో సస్యరక్షణ పనులు పూర్తిగా నిమగ్నం కావడంతో, కొంతమేరకు గ్రామీణ ప్రాంతంలో రైతులకు ఇబ్బంది కలుగుతున్నది అన్నమాట వాస్తవమే.

దీనితో బీహార్ ఉత్తరప్రదేశ్ చెందిన వలస కూలీలు ఈ ప్రాంతాలలో పరిచయమై నాటు వేసే ప్రక్రియలో ఎకరాకు 5000 రూపాయలు, మాట్లాడి పూర్తిగా అయిపోయేంతవరకు సుమారు 21 మంది మగవారు టీం తో ఏర్పడి, సుమారు వందమంది ఈ ప్రాంతంలో దిగి, త్వర, త్వరగా నాటు వేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు.

గతంలో మన ఆడ కూలీలు ఎకరాకు 5000 వేలు తీసుకుంటూ, నారు గట్టిగా వచ్చిందని ,నారు దూరంగా ఉందని మోయడానికి ఒక మనిషి ప్రత్యేకంగా కావాలని , పని అయిపోయినంక కూల్ డ్రింక్స్, ఇవ్వాలని, రైతులను ఇబ్బందులకు గురి చేసేవారు.

ప్రస్తుతం ఈ సమస్యలన్నింటికీ ఉత్తరప్రదేశ్ బీహార్ చెందిన మగ కూలీలు అడ్డుకట్ట వేయడంతో, రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఏమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ భారతదేశంలోని వరి ఉత్పాదక చెందిన రాష్ట్రాలలో, తెలంగాణ రాష్ట్రం కూడా అగ్రస్థానం ఉండాలని దృఢ సంకల్పంతో ముందుకు తీసుకుపోతూ పండించిన పంటకు స్థానికంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి,

రైతు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొని, రైతులు మెచ్చిన నాయకుడిగా, రైతు బాంధవుడుగా ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణలో నిలిచిపోవడం గమనార్వం….