అంబులెన్స్ లో డెలివరీ….తల్లి బిడ్డలు క్షేమం
108 సిబ్బందిని అభినందించిన జిల్లా మేనేజర్.
ఏటూరునాగారం జూలై 28 నిజం చెపుతాం న్యూస్:
తెల్లవారుజామున ఏడు గంటల సమయంలో భూపాలపల్లి 108 అంబులెన్స్ కి బక్కయ్యపేట గ్రామం నుండి పురిటినొప్పుల కేసు రావడం జరిగింది.
108 స్టాప్ వెళ్లి ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన బయ్యక్కపేట పేట అనే గ్రామం అటవీ ప్రాంతం ఈ వర్షాల కారణంగా రోడ్డు సౌకర్యం సరిగా లేక వెహికల్ వెళ్లనిచో భూపాలపల్లి అంబులెన్స్ స్టాప్ సుమారు ఒక కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్లి తీసుకురావడం కూడా జరిగింది.
గుత్తి కోయల కి సంబంధించి న తెల్లంఎర్రమ్మ భర్త రాంబాబువయస్సు 29 గర్భవతి తో ఉన్న పేషెంట్ ని అంబులెన్స్ లో ఎక్కించుకొని వస్తుండగా భూపాలపల్లి రాంపూర్ ప్రాంతంలో 9:30 గంటల సమయంలో అంబులెన్స్ లోనే నార్మల్ డెలివరీ జరగడం జరిగింది.
వారికి మగ బిడ్డ పుట్టడం జరిగింది సుమారువేట్ 2.5 కేజీ తల్లి బిడ్డలని 100 పడకల హాస్పిటల్ భూపాలపల్లి లో సురక్షితంగా అడ్మిట్ చేశారు.
ఈ ఘటనలో 108సిబ్బంది ఈఎంటి విజయ్ కుమార్, పైలట్ శరత్, స్థానిక ఆశ వర్కర్,గర్భిణీ స్త్రీ కుటుంబ సభ్యులు ఉన్నారు.