Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

టాలీవుడ్ నిర్మాతలకు కోట్లలో నష్టాలను మిగిల్చిన టాప్10 సినిమాలివే

తెలుగులో ఇండస్ట్రీ హిట్లతో పాటు, డిజాస్టర్స్ గా నిలిచిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో నిర్మాతలకు కోట్లలో నష్టాలను మిగిల్చిన టాప్ 10 సినిమాలను తెలుసుకుందాం.

1. సైరా నరసింహారెడ్డి

చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా ఎవరేజ్ హిట్ గా నిలిచింది. ఇది చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమా చేయాలని చిరంజీవికి ఎంతగానో ఆసక్తి ఉండేది. 270 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగులో 143 కోట్ల ప్రీ రీలీజ్ ఈవెంట్ బిజినెస్ చేసారు. మొత్తంగా ఈ సినిమాకు 187 కోట్ల 85 లక్షల బిజినెస్ జరిగితే కేవలం 143.80 లక్షల షేర్ ను మాత్రమే రాబట్టింది. తెలుగులో మంచి హిట్ టాక్ ను తెచ్చుకున్నా ఓవరాల్ గా సెమి హిట్ గా నిలిచింది. ఫైనల్ గా 43.45 లక్షల నష్టాన్ని తీసుకు వచ్చి తెలుగులో అత్యంత నష్టాలను చవి చూసిన సినిమాలో 10 వ స్థానంలో నిలిచింది.

2. శాకుంతలం

రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా పై మొదటి నుండే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ సినిమాకు దాదాపు 65 కోట్ల బడ్జెట్ అయింది. ఫ్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం 18 కోట్లకే చేసారు. చివరకు 4 కోట్ల బిజినెస్ చేసి 45 కోట్ల నష్టాన్ని  తీసుకు వచ్చి తెలుగులో అత్యంత నష్టాలను చవి చూసిన సినిమాలో 9 వ స్థానంలో నిలిచింది.

3. ఎన్టీఆర్ మహానాయకుడు

ఈ సినిమాకు బడ్జెట్ 30 కోట్లు. అయితే బిజినెస్ మాత్రం 51 కోట్లు అయింది. కాని ఫైనల్ గా మాత్రం 5 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి 45 కోట్ల నష్టాన్ని తీసుకువచ్చి పెద్ద డిజాస్టర్ గా నిలిచి  తెలుగులో అత్యంత నష్టాలను చవి చూసిన సినిమాలో 8 వ స్థానంలో నిలిచింది.

4. ఎన్టీఆర్ కథానాయకుడు

ఈ సినిమాకు దాదాపు 50 కోట్లు ఖర్చు చేయగా ప్రీరిలీజ్ బిజినెస్ అయితే 70 కోట్ల 50 లక్షలు అయింది. ఓవరాలు ఈ సినిమా 20 కోట్ల 20 లక్షల షేర్ ను కలెక్ట్ చేసి 50 కోట్ల 27 లక్షల నష్టాన్ని చవి చూసి  తెలుగులో అత్యంత నష్టాలను చవి చూసిన సినిమాలో 7 వ స్థానంలో నిలిచింది.

5. సాహో

350 కోట్ల బడ్జెత్ తెరకెక్కించారు. 270 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫైనల్ గా భాక్సాఫీస్ దగ్గర 219 కోట్లను మాత్రమే రాబట్టి ఫైనల్ గా 52.15 లక్షల లాస్ ను తీసుకుని వచ్చి ఏవరేజ్ సినిమాగా నిలిచి  తెలుగులో అత్యంత నష్టాలను చవి చూసిన సినిమాలో 6 వ స్థానంలో నిలిచింది.

6. స్పైడర్

ఈ సినిమాకు 125 కోట్ల బడ్జెట్ అయితే కేవలం తెలుగులోనే 106 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తమిళంలో 18 కోట్లకు అమ్మడం జరిగింది. మొత్తంగా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 124 కోట్ల 30 లక్షల వరకు బిజినెస్ జరిగింది. ఫైనల్ గా 63 కోట్ల 80 లక్షల షేర్ ను మాత్రమే రాబట్టి 60 కోట్ల 50 లక్షల నష్టం తీసుకు వచ్చి తెలుగులో అత్యంత నష్టాలను చవి చూసిన సినిమాలో 5 వ స్థానంలో నిలిచింది.

7. లైగర్

ఈ సినిమా 100 కోట్ల వరకు బడ్జెట్ అయింది. బిజినెస్ మాత్రం 87 కోట్ల 40 లక్షల వరకు జరిగింది. బ్రేక్ ఈవెన్ మాత్రం 90 కోట్లు అయితే ఫైనల్ గా 28 కోట్ల 20 లక్షలను మాత్రమే కలెక్ట్ చేసి 61 కోట్ల 68 లక్షల లాస్ ను తీసుకుని వచ్చి పెద్ద డిజాస్టర్ గా నిలిచి తెలుగులో అత్యంత నష్టాలను చవి చూసిన సినిమాలో 4 వ స్థానంలో నిలిచింది.

8. అజ్ఞాతవాసి

పవన్ కళ్యాణ్ 25వ చిత్రం. త్రివిక్రమ్ డైరెక్టర్. ఈ సినిమా పై భారీ అంచనాలను పెట్టుకున్నారు ప్రేక్షకులు. ఈ సినిమా కోసం దాదాపు 70 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. బిజినెస్ 123 కోట్ల 60 లక్షల వరకు జరిగింది. ఫైనల్ గా మాత్రం 57 కోట్ల 50 లక్షలను మాత్రమే తీసుకు వచ్చింది. 66 కోట్ల వరకు నష్టాలను తీసుకు వచ్చి తెలుగులో అత్యంత నష్టాలను చవి చూసిన సినిమాలో 3వ స్థానంలో నిలిచింది.

9. ఆచార్య

చిరంజీవి, రాంచరణ్ హీరోలుగా మూవీ, దర్శకత్వం కొరటాల శివ. ఈ సినిమాకు 132 కోట్ల 50 లక్షల వరకు బిజినెస్ జరిగింది. షైనల్ గా మాత్రం 45 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్ట గలిగి 84 కోట్ల నష్టాన్ని తీసుకు వచ్చి తెలుగులో అత్యంత నష్టాలను చవి చూసిన సినిమాలో 2 వ స్థానంలో నిలిచింది.

10. రాధేశ్యామ్

ప్రపంచ వ్యాప్తంగా 202 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో 106 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. హిందీలో 52 కోట్ల 59 లక్షల బిజినెస్ జరిగింది. ఫైనల్ రన్ లో మాత్రం 120 కోట్ల వరకు నష్టాలను తీసుకువచ్చి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచి తెలుగులో అత్యంత నష్టాలను చవి చూసిన సినిమాలో 1 వ స్థానంలో నిలిచింది.