Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అధిక వర్షాలకు వరి సాగులో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

మెదక్ అల్లాదుర్గం జులై 27 (నిజం చెపుతాం)
అల్లాదుర్గం మండలంలో ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాలకు రైతులు ఖరీఫ్ సాగులో జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలని అల్లాదుర్గ్ మండల వ్యవసాయాధికారి J. రాజేష్ కుమార్ అన్నారు.

గురువారం అల్లాదుర్గంలో రైతుల పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పొలాల్లో మరియు ప్రత్తి మొక్కల మధ్య నీరు నిలవకుండా బయటకు పోయేలా చర్యలు తీసుకోవాలన్నారు.

అధిక వర్షాల వలన పత్తి పసుపు రంగులోకి మారే అవకాశం ఉంది, దీని అధిగమించడానికి మొక్క వయసును బట్టి 10 గ్రాముల పొటాషి యం నైట్రేట్ లేదా 19.19.19 లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

అదేవిధంగా పంట ఎదుగుదలను పెంచడానికి వర్షాలు తగ్గిన వెంటనే 25 కిలోల యూరియా 10 కిలోల పొటాష్ ఎరువులు మొక్కకు ఐదు సెంటీమీటర్ల దూరంలో వేసుకోవాలి

అధిక తేమ వల్ల పత్తి మొక్కలకు వేరుకుళ్ళు తెగులు సోకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది

దీని నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్ లేదా ఒక గ్రామం కార్బండజిమ్ లీటర్ నీటికి కలిపి ఆ ద్రావణాన్ని తెగులు సోకిన మొక్కల పాదుల చుట్టూ నేలపై వారం వారం. వ్యవధిలో రెండు సార్లు పోయాలి.

కావున వర్షాలు నిలిచిన తర్వాత పొటాషియం నైట్రేట్ లేదా 19-19-19, 10 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారి చేయాలి.

వర్షాలు పూర్తిగా ఆగిన తర్వాత అదనపు మోతాదుగా ఎకరాకు 20-25 కిలోల యూరియా, 15 నుండి 20 కిలోల మూరేట ఆఫ్ పొటాష్ ను అందజేయాలి.

వర్షాలకు వరి నాటు వేసిన పొలాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు అయితే ఆ పొలాలను దమ్ము చేసి మళ్లీ స్వల్పకాలిక రకాలను ఏంచుకొని నేరుగా విత్తుకోవాలి.

చల్లటి వాతావరణంలో అగ్గి తెగులు సోకే అవకాశం ఉంది

దీని నివారణకు ట్రైసైక్లోజోల్ : మానుకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.