Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆలేరు లో వెలగని వీధి దీపాలు…అలంకారంగా ఎల్.ఈ.డి లైట్లు

— వీధి దీపాలు వెలగక రోజూ అమావాస్య చీకట్లే కనిపిస్తున్నాయి

— నిర్వహణ అస్తవ్యస్తం.. పట్టించుకోని ఆధికారులు

ఆలేరు జులై 27 (నిజం చెపుతాం)

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని రహదారి లో వీధి దీపాలు వెలగకపోవడం తో దుకాణాల్లోని లైట్లు,వాహనాల వెలుతురులో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.

లైట్‌ పోయినా,మరమ్మతులకు గురైనా కొత్తగా ఏర్పాటు చేసే పరిస్థితి పట్టణంలో లేదు.బస్టాండు, ట్యాక్సీ స్టాండు కూడలి, గాంధీ బొమ్మల కూడలి వంటి ప్రాంతాల్లో సెంట్రల్‌ లైట్లు సక్రమంగా వెలగడం లేదు.

అధికారులకు మొర పెట్టుకుంటున్నా పట్టించుకున్న వారే కరువయ్యారు.స్థానిక సంస్థలు మౌలిక వసతులపై దృష్టి పెట్టకపోవడంతో ఆలేరు పురపాలక సంఘం లో వీధి దీపాలు వెలగక రోజూ అమావాస్య చీకట్లే కనిపిస్తున్నాయి.

వీటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.మొత్తం రాత్రి వేళల్లో ముఖ్య కూడళ్లు, ప్రధాన రహదారులు, వీధుల్లో వీధి దీపాలు వెలగడం లేదు.నెలలు తరబడి పట్టించుకోకపోవడంతో ప్రజలు చీకట్లో రాకపోకలు సాగిస్తూ అవస్థలు పడుతున్నారు.

ప్రక్కనే ఉన్న వీధి వ్యాపారులకు చీకట్లు కమ్మడం తో వచ్చి పోయే వాహనాల వెలుగుల్లో వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.

అసలే వర్షా కాలం కావడం తో రోడ్డుకు ఇరు ప్రక్కల నీరు నిలుస్తున్నాయి.నీరు నిలవడం వలన దోమలు నిల్వ ఉండడం వలన ప్రజలకు రోగాలు ప్రబలే అవకాశం ఉన్నందున ఇప్పటికైనా సమస్యల పై దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.