మున్నేరు వాగులో మునిగిపోయిన ట్రాక్టర్
బాధితుడు బానోత్ లచ్చిరాం
తెలంగాణ స్టేట్ బ్యూరో జూలై 27 నిజం న్యూస్
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం చౌల్ల తండా లో బానోత్ లచ్చిరాం జాండ్రి టాక్టర్ వాగులో మునిగిపోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న భారీ నుండి అతి భారీ వర్షాల వల్ల వాగులు వంకలు తెంచుకొని ఉప్పొంగి వస్తున్న మున్నేరు వాగు తండా సమీపానికి చేరుకుంది.
బాధితుడు బానోత్ లచ్చిరాం వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్ తండ పక్కన చేన్లో ఉండగా వాగులు వంకలు తెంచుకొని పాకాల మున్నేరు వాగు అతివేగంగా ప్రవహించడంతో బానోత్ లచ్చిరాం టాక్టర్ మునిగిపోయింది ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బానోతు లచ్చిరాం మాట్లాడుతూ.. గత కొన్ని రోజుల నుండి కురుస్తున్న వర్షానికి మున్నేరు వాగు చౌల్ల తండ దాకా నీళ్లు ప్రవహించడంతో టాక్టర్ మునిగిపోయిందని బాధితులు తెలిపారు.
మునిగిపోయిన ట్రాక్టర్ ను స్థానిక అధికారులు చౌల్ల తండకు చేరుకొని సందర్శించారు. బాధితులు తగు న్యాయం చేకూర్చగలుగుతారని అధికారులను కోరారు.