Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జల దిగ్బంధనంలో మానుకోట

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, జూలై 27 నిజం న్యూస్

మానుకోట జిల్లాకు గత 20 సంవత్సరాల కాలంలో ఇంతటి వర్షం చూడలే దు. చెరువులు వాగులు, వంకలు వర్షంతో నిండి పట్టణంలో మోకాలు లోతు నీరు ప్రవహించింది.

పూసపల్లి రోడ్డులో గల రాళ్లవాగు సమీపంలో ఉన్న పెట్రోల్ బంకు పూర్తిగా నీటితో నిండిపోయింది.

మహబూబాబాద్ జిల్లాను వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. నిన్న రాత్రి అంతా భీకర వర్షం కురవడంతో పట్టణం నీటిలో తడిసి ముద్దయింది.

పట్టణంలోని కాలనీలలో వరద నీరు ఇళ్లలోకి వచ్చి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహబూబాబాద్ నుండి ఇతర పట్టణాలకు, గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.

మహబూబాబాద్ నుండి కురివి, ఖమ్మం, నర్సంపేట, వరంగల్, ఇల్లందు, భద్రాచలం రహదారులలో వరద నీరు ప్రవహిస్తున్నందున ఆయా ఏరియాలలోని వాగులు పొంగి పొరలుతున్నందున మానుకోట నుండి ఆయా గ్రామాలకు, పట్టణాలకు సంబంధాలు తెగిపోయాయి.

పట్టణంలో గత రాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల సైడ్ కాలువలు నిండి రోడ్లపై మోకాళ్ళు లోతు నీరు ప్రవహించింది.

పట్టణంలోని సుమారు 20 పైగా కాలనీలు, తండాలు నీటిలో మునిగిపోయాయి . ఇండ్లలోకి నీరు ప్రవేశించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

జిల్లా పాలన యంత్రాంగం, అదన కలెక్టర్ డేవిడ్ పోలీసు, ఎమ్మెల్యే, ఇతర ఉన్న అధికారులు వరద పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు సలహాలు సహాయక చర్యలు చేస్తున్నారు.